స్టాక్ మార్కెట్లకు స్వల్ప లాభాలు- 60,100పైకి సెన్సెక్స్​

author img

By

Published : Oct 11, 2021, 3:49 PM IST

Stocks closing

స్టాక్ మార్కెట్లు (Stock Market) సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ (Sensex Today) 77 పాయింట్లు పెరిగి 60,100 పైకి చేరింది. నిఫ్టీ (Nifty Today) 51 పాయింట్ల లాభంతో 17,950 మార్క్​కు చేరువైంది.

స్టాక్ మార్కెట్లు (Stock Market) సోమవారం స్వల్ప లాభాలను గడించాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 77 పాయింట్లు పెరిగి 60,136 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 51 పాయింట్ల లాభంతో 17,946 వద్దకు చేరింది.

ఆటోమొబైల్​, బ్యాంకింగ్, ఫార్మా షేర్లు సానుకూలంగా స్పందించాయి. ఐటీ షేర్లు డీలా పడ్డాయి.

ఇంట్రాడే సాగిందిలా (Intraday)..

సెన్సెక్స్ 60,476 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 59,811 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 18,032 పాయింట్ల గరిష్ఠ స్థాయి (కొత్త గరిష్ఠం), 17,839 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

మారుతీ సుజుకీ, పవర్​గ్రిడ్​, ఐటీసీ, ఎన్​టీపీసీ, ఎస్​బీఐ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.

టీసీఎస్​, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్​టెక్​, ఎల్​&టీ ఎక్కువగా నష్టపోయాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. నిక్కీ (జపాన్​), హాంగ్​సెంగ్​ (హాంకాంగ్​) సూచీలు లాభాలను గడించాయి. షాంఘై (చైనా) సూచీ నష్టపోయింది. కోస్పీ (దక్షిణ కొరియా) సూచీ సెలవులో ఉంది.

ఇదీ చదవండి: శని, ఆదివారాల్లో ఎస్​బీఐ ఆన్​లైన్​ సేవలకు అంతరాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.