ETV Bharat / business

షేర్లు తాకట్టు పెట్టి.. వేదాంత ప్రమోటర్స్​ భారీ సమీకరణ

author img

By

Published : Nov 26, 2021, 10:25 PM IST

వేదాంత లిమిటెడ్​(Vedanta Ltd) పునర్​వ్యవస్థీకరణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సంస్థలోని షేర్ల తాకట్టు ద్వారా రూ.6వేల కోట్లు సమీకరించాయి హోల్డింగ్​ కంపెనీలు. మూడు కీలక ఒప్పందాల ద్వారా వీటిని పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

Vedanta Ltd
వేదాంత లిమిటెడ్

వేదాంత లిమిటెడ్​కు(Vedanta Ltd) చెందిన హోల్డింగ్​ కంపెనీలు తమ షేర్లను తాకట్టు పెట్టి 800 మిలియన్​ డాలర్లు( రూ.6వేల కోట్లు) సమీకరించాయి. వేదాంత లిమిటెడ్​లోని సుమారు 65.128 శాతం వాటాను తాకట్టు పెట్టడం వల్ల.. మూడు ఒప్పందాల్లో ఈ నిధులను సమీకరించినట్లు సెబీ ఫైలింగ్​లో వేదాంత పేర్కొంది.

  • మొదటి ఒప్పందం ప్రకారం.. ట్విన్​​ స్టార్​ హోల్డింగ్స్​ లిమిటెడ్(Twin Star Holdings Ltd )​, లండన్​కు చెందిన స్టాండర్డ్​ చార్టెర్డ్​ బ్యాంక్​తో 400 మిలియన్​ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది.
  • రెండోది.. వేదాంత నెదర్లాండ్స్​ ఇన్వెస్ట్​మెంట్స్​ బీవీ(Vedanta Netherlands Investments BV).. 150 మిలియన్​ డాలర్లను స్టాండర్డ్​ చార్టెర్డ్​ బ్యాంక్​, లండన్​ ద్వారా పొందింది.
  • మూడోది.. వేదాంత రీసోర్సెస్(Vedanta Resources Limited)​ 250 మిలియన్​ డాలర్లను హాంగ్​కాంగ్​కు చెందిన స్టాండర్డ్​ చార్టెర్డ్​ బ్యాంక్​ నుంచి సేకరించింది. ఈ ఒప్పందాల్లో రుణ గ్రహీతలు, హామీదారులు ప్రమోటర్లుగా వేదాంత ఫైలింగ్​ పేర్కొంది.

మరోవైపు.. వేదాంత నెదర్లాండ్స్​ ఇన్వెస్ట్​మెంట్​ బీవీ, ట్విన్​స్టార్​ హోల్డింగ్స్​.. వరుసగా 1.71, 2.80 శాతం మేర వేదాంతలో ఈక్విటీ షేర్​ క్యాపిటల్​ను కలిగి ఉన్నట్లు మడిసన్​ పసిఫిక్​ ట్రస్ట్​ వెల్లడించింది. కొద్ది రోజుల క్రితం వేదాంత లిమిటెడ్​లోని 17 కోట్ల ఈక్విటీ షేర్లను ఒక్కోషేరుకు రూ.350 చొప్పున రూ. 5,950 కోట్లకు కొనుగోలు చేయాలని భావించాయి.

అనిల్​ అగర్వాల్​ నేతృత్వంలోని మైనింగ్​ కంపెనీని పునర్​వ్యవస్థీకరిస్తున్నట్లు నవంబర్​ 17న ప్రకటించింది. అల్యూమినియం, ఇనుము-ఉక్కు, ఆయిల్​-గ్యాస్​లను ప్రత్యేక సంస్థలుగా విడదీసి స్టాక్​ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేసే ఉద్దేశంలో ఉన్నట్లు ప్రకటించిన తర్వాత ఈ ప్రక్రియ చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి: బీపీసీఎల్​లో ప్రభుత్వ వాటా కొనుగోలుకు వేదాంత ఆసక్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.