ETV Bharat / business

సైబర్ బీమా గురించి ఇవి తెలుసా?

author img

By

Published : Apr 5, 2021, 6:09 PM IST

ప్రపంచంలో అత్యధిక సైబర్ దాడులకు గురయ్యే దేశాలలో అమెరికా, చైనా అగ్ర‌స్థానంలో ఉన్నాయి. మార్ష్‌-ఆర్ఐఎంఎస్ ఇటీవల జరిపిన ఉమ్మడి అధ్యయనం ప్ర‌కారం భార‌త‌దేశంలోనూ పెద్ద ఎత్తున సైబర్ దాడులు, డేటా దొంగతనం వంటి ప్ర‌మాదాలు జ‌ర‌గ‌వ‌చ్చ‌ని తెలిసింది. ఈ క్రమంలో సైబర్​ బీమా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు నిపుణులు.

What is cyber insurance and how its covers
సైబర్ బీమా గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య విషాయాలివే!

సైబ‌ర్ బీమా అంటే ఏమిటి? ఎందుకు తీసుకోవాలి అంటే... రోజు రోజుకు పెరుగుతున్న ఇంట‌ర్ నెట్‌, డిజిట‌ల్ వినియోగంతో పాటుగా సైబ‌ర్‌నేర‌లు కూడా పెరుగుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్ర‌కారం, దేశీయ సైబ‌ర్ బీమా మార్కెట్ నెమ్మ‌దిగా ఆద‌ర‌ణ పొందుతోంది. ప్రపంచంలో అత్యంత సైబర్ దాడులకు గురయ్యే దేశాలలో అమెరికా, చైనా అగ్ర‌స్థానంలో ఉన్నాయి. మార్ష్‌-ఆర్ఐఎంఎస్ ఇటీవల జరిపిన ఉమ్మడి అధ్యయనం ప్ర‌కారం భార‌త‌దేశంలో కూడా పెద్ద ఎత్తున సైబర్-దాడులు, డేటా దొంగతనం వంటి ప్ర‌మాదాలు జ‌ర‌గ‌వ‌చ్చ‌ని వెల్లడైంది.

డిజ‌ట‌ల్ ఆస్తుల‌కు, సైబ‌ర్ నేర‌స్థు‌లు ద్వారా పొంచివున్న ప్ర‌మాదం, సైబ‌ర్ బీమా అవ‌స‌రాన్ని సూచిస్తుంది. ఈ పెరుగుతున్న సైబ‌ర్ నేరా‌ల దృష్ట్యా బ‌జాజ్ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్‌ పాల‌సీ, మాల్వేర్ దాడి, ఐటీ డేటా దొంగ‌త‌నం, ఈమెయిల్ స్పూకింగ్‌, సైబ‌ర్ దోపిడి, సైబర్ స్టాకింగ్ వంటి 11 ర‌కాల సైబ‌ర్ నేర‌ల‌కు వ్య‌తిరేకంగా వ్య‌క్తుల‌కు బీమా సౌక‌ర్యాల‌ను అందిస్తుంది.

కొన్ని ర‌కాల ప్ర‌మాదాలు, న‌ష్టాల‌కు మాత్ర‌మే బీమా అవ‌స‌రం ఉంద‌ని చాలా మంది భావించేవారు. కానీ ప్ర‌స్తుతం పెరుగుతున్న సైబ‌ర్ నేరాలు, మాల్వేర్ దాడుల నుంచి వినియోగ‌దారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ఈ విధ‌మైన సంఘ‌ట‌న‌లు జ‌రుగకుండా బీమా క‌వ‌ర్లు నిరోధించ‌లేవు. అయితే ఈ న‌ష్టాల ఆర్థిక ప్ర‌భావాన్ని త‌గ్గిస్తాయి.

వేటిని క‌వ‌ర్ చేస్తాయి?

సైబ‌ర్ దాడి అనంత‌రం అయ్యే ఖ‌ర్చుల‌ను సైబ‌ర్ బీమా క‌వ‌ర్ చేస్తుంది. పాల‌సీ జాబితాలో పేర్కొన్న వివిధ ర‌కాల సైబర్ నేరాలు జ‌రిగిన అనంత‌రం ప్రాసిక్యూషన్ ప్రక్రియ, రక్షణ కోసం వెచ్చించే ఖర్చు, బీమా సంస్థ చెల్లిస్తుంది. ఆర్థిక న‌ష్టం, సైబ‌ర్ నేరాల కార‌ణంగా పాల‌సీదారుడు ఆన్‌లైన్లో న‌గ‌దు కోల్పోయిన‌ప్పుడు, పాల‌సీలో ఇచ్చిన విధంగా హామీని చెల్లిస్తాయి.

భార‌త‌దేశం డిజిటైలేష‌న్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. నెట్ బ్యాంకింగ్‌, ఇత‌ర ఆన్‌లైన్ వ్య‌వ‌స్థ‌లు ప‌నితీరు పెరుగుతున్న ఈ స‌మ‌యంలో థ‌ర్డ్ పార్టీ, పున‌రుద్ధరణ ఖర్చులకు వ్యతిరేకంగా నష్టపరిహారం సంస్థలు చెల్లిస్తాయి. దీంతో పాటు సైబర్ దాడి కౌన్సెలింగ్ చికిత్సలకు సంబంధించిన ఖర్చులు కూడా బీమా సంస్థ‌లు అందిస్తున్నందున ఈ పాల‌సీలు చాలా వ‌ర‌కు సైబ‌ర్ నేరాల వ‌ల్ల న‌ష్ట‌పోయిన వారికి అండ‌గా ఉంటాయ‌న్న‌ది నిపుణుల న‌మ్మ‌కం.

వేటిని క‌వ‌ర్ చేయ‌వు?

అంత‌ర్జాతీయంగా, ఉద్దేశ‌పూర్వ‌కంగా జ‌రిగే దాడులకు సంబంధించి క్లెయిమ్ చేసుకునేందుకు వీలుండ‌దు. బీమా తీసుకున్న వ్య‌క్తులు మోసపూరిత చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌కూడ‌దు. పాల‌సీ కొనుగోలుకు ముందుగా జ‌రిగిన దాడుల‌ను గాని, పాల‌సీదారుడు కోల్పోయిన డేటా, చిత్రాల‌ను గాని పాల‌సీ క‌వ‌ర్ చేయ‌దు. స‌రైన పాస్‌వ‌ర్డ్‌తో యాంటీ వైర‌స్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేయ‌క‌పోయినా‌, త‌గిన ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోకపోయినా పాల‌సీ క‌వ‌ర్ చేయ‌దు.

ప్రీమియం, క‌వ‌ర్‌..

హామీ మొత్తం ల‌క్ష రూపాయల‌ నుంచి ఒక కోటి రూపాయ‌ల వ‌ర‌కు ఉంటుంది. బ‌జాజ్ అలియాంజ్ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్ రూ. 662 ప్రీమియంతో రూ. 1 ల‌క్ష రూపాయల హామీ అందిస్తుంది. ప్రీమియం పెరుగుతున్న కొద్దీ హామీ మొత్తం పెరుగుతుంది. అన్ని ర‌కాల క‌వ‌ర్‌ల‌కు కొన్ని ప‌రిమితులు ఉన్నాయి. ఈమెయిల్‌ స్పూకింగ్‌కు గ‌రిష్ఠంగా 15 శాతం మేర, ఫిషింగ్‌కు, ఐటీ, స‌మాచారం దొంగిలించిన‌ప్పుడు 25 శాతం మేర క‌వ‌ర్ చేస్తారు. ఇత‌ర అన్ని క‌వ‌ర్‌ల‌కు 10 శాతం మేర ప‌రిధి ఉంటుంది.

ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌జ‌లు అధిక శాతం ఈమెయిల్‌, సోష‌ల్ మీడియాలో కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆన్లైన్ బ్యాంకింగ్, ఇతర ఆన్లైన్ లావాదేవీలను తరచూ నిర్వహిస్తారు. నిపుణుల స‌ల‌హాలు, సంప్ర‌దింపులు, స‌రైన భ‌ద్ర‌త చ‌ర్య‌లు లేకుండానే వారి వ్యాపారాన్ని ఆన్‌లైన్‌తో అనుసంధానించి సైబ‌ర్ నేరానికి గుర‌వుతున్నారు. అన్ని ర‌క్ష‌ణ చ‌ర్య‌ల‌ను తీసుకుంటూ, ఆన్‌లైలో చురుకుగా కార్య‌కాలాపాలు జ‌రిపే వారికి ఇది చాలా ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది.

ఇదీ చూడండి: 'భారత్​లోని 52% కంపెనీలపై సైబర్​ దాడులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.