ETV Bharat / business

ఆహార భద్రత సూచీలో భారత ర్యాంకు ఎంతంటే?

author img

By

Published : Oct 20, 2021, 4:57 AM IST

FOOD SECURITY INDEX
ఆహార భద్రత సూచీ

ప్రపంచ ఆహార భద్రత సూచీలో భారత్ 71వ స్థానంలో నిలిచింది. 113 దేశాలతో కూడిన ఈ జాబితాలో పొరుగు దేశాలైన పాకిస్థాన్, శ్రీలంకల కంటే భారత్ వెనుకబడి ఉండటం గమనార్హం.

ప్రపంచ ఆహార భద్రత సూచీ-2021లో భారత్ 71వ స్థానంలో నిలిచింది. ఆహార స్థోమత విభాగంలో పాకిస్థాన్ 52.6, శ్రీలంక 62.9 పాయింట్లతో భారత్ కంటే(50.2) మెరుగైన స్థాయిలో ఉన్నాయి. ఎకనామిస్ట్ ఇంపాక్ట్, కార్టెవా అగ్రిసైన్స్​లు సంయుక్తంగా ఈ నివేదికను విడుదల చేశాయి. ఆయా దేశాల్లోని ఆహార లభ్యత, నాణ్యత, భద్రత, సహజ వనరులు, స్థితిస్థాపకత వంటి అంశాల ఆధారంగా ఈ నివేదిక రూపొందింది.

దేశంలోని ప్రజల ఆదాయం, ఆర్థిక అసమానతలు సహా 58 ప్రత్యేక ఆహార భద్రతా సూచికలను పరిగణనలోకి తీసుకుని రూపొందించే ఈ సూచీ.. 2030 నాటికి ఆకలి బాధితులను సున్నాకు పరిమితం చేయాలన్న ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు పనిచేస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.