ETV Bharat / briefs

కర్నూలు విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ షురూ!

author img

By

Published : May 9, 2019, 6:37 AM IST

విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ షురూ!

విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని కర్నూలు కలెక్టర్​ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సంవత్సరం ఆన్​లైన్​ విధానంలో పుస్తకాలు అందజేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి తెలిపారు. ఈ నెలాఖరులోగా విద్యార్థులందరికీ పుస్తకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

పాఠ్యపుస్తకాల పంపిణీ షురూ!

విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని కర్నూలు కలెక్టర్​ సత్యనారయణ ప్రారంభించారు. ఈ ఏడాది ఆన్​లైన్​ విధానంలో పుస్తకాలు అందజేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి తహెరా సుల్తానా తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 23 లక్షల 80వేల పాఠ్య పుస్తకాల అవసరం ఉందని వెల్లడించారు. ఈ నెలాఖరులోపు విద్యార్థులందరికీ..పుస్తకాలు అందేలా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. మొదట పట్టణప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నామని వివరించారు.
వరల్డ్​ రెడ్​క్రాస్​ డే సందర్భంగా రక్తనిధి కార్యాలయ ఆవరణలో జరిగిన వేడుకలకు కలెక్టర్​ సత్యనారయణ హాజరయ్యారు. రక్తదానంపై జరిగిన అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. రక్తదాన శిబిరాన్ని సందర్శించారు.

ఇవీ చదవండి...చిన్నారులపై పిచ్చి కుక్కల దాడి..ఒకరి పరిస్థితి విషమం

Intro:ఎండలు మండుతున్నాయి... రానున్న మూడు నాలుగు రోజుల పాటు తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్న సమాచారంతో జిల్లా యంత్రాంగం ఇప్పటికే ప్రజలను జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేసింది. దీంతోపాటు అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ ప్రజలకు చల్లని తాగునీటిని అందుబాటులోకి తెస్తుంది. నిన్నటి వరకు పంచాయతీలు, పట్టణాల్లో ప్రధాన కూడళ్ల వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతోపాటుగా పౌరసరఫరాల శాఖ పర్యవేక్షిస్తున్న పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలలో ప్రజలకు తాగునీటిని అందుబాటులో ఉంచాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పెట్రోల్ బంకులు.. గ్యాస్ ఏజెన్సీల వద్ద వాటర్ కూలర్ లను ఏర్పాటు చేయగా... తాజాగా చౌకధరల దుకాణాలలోను కార్డుదారులకు తాగునీటి సదుపాయాన్ని కల్పిస్తున్నారు. బుధవారం సాయంత్రం జిల్లా పౌరసరఫరాల అధికారులు నగరంలోని పలు చౌక ధరల దుకాణాలను సందర్శించారు. అక్కడ డీలర్లు ఏర్పాటు చేసిన తాగునీటి సదుపాయాలను పరిశీలించి డీలర్ లను అభినందించారు. మే నెలాఖరు వరకు కార్డుదారులకు ప్రజలకు చల్లని నీటిని అందించాలని సూచించారు....
bite: టి. శివరామ ప్రసాద్, పౌరసరఫరాల అధికారి గుంటూరు జిల్లా


Body:గుంటూరు పశ్చిమ


Conclusion:kit no765
భాస్కరరావు
8008574897
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.