ETV Bharat / bharat

Vizianagaram Train Accident Reasons: విజయనగరం జిల్లా రైలు ప్రమాదంపై అనేక సందేహాలు.. కారణాలు ఏంటి..?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2023, 7:07 AM IST

Vizianagaram Train Accident Reasons: విజయనగరం జిల్లాలో.. జరిగిన రైలు ప్రమాదం అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రమాదానికి సిగ్నలింగ్ వ్యవస్థ లోపమా?.. లేదంటే మానవతప్పిదమా అనేది తేలాల్సి ఉంది. రాయగడ ప్యాసింజర్‌ లోకో పైలెట్, అసిస్టెంట్‌ లోకో పైలెట్‌ ఇద్దరూ.. ప్రమాదంలో మరణించడంతో ఉన్నతాధికారుల బృందం ఏం తేలుస్తుందనేది.. ఉత్కంఠగా మారింది. ఉన్నతస్థాయి దర్యాప్తు నివేదిక వస్తే తప్ప కారణాలు తెలిసే అవకాశం లేదు.

Vizianagaram_Train_Accident_Reasons
Vizianagaram_Train_Accident_Reasons

Vizianagaram Train Accident Reasons: విజయనగరం జిల్లా రైలు ప్రమాదంపై అనేక సందేహాలు.. కారణాలు ఏంటి..?

Vizianagaram Train Accident Reasons: విజయనగరం జిల్లాలో 14 మంది ప్రయాణికుల్ని బలిగొన్న రైలు ప్రమాదానికి.. స్పష్టమైన కారణాల కోసం రైల్వేయంత్రాంగం దృష్టిసారించింది. ప్రమాదం జరిగిన.. 19 గంటల్లోనే ట్రాక్‌ను పునరుద్ధరించిన రైల్వే అధికారులు.. అంతే వేగంతో ప్రమాద కారణాలు నిగ్గుతేల్చేపనిలో పడ్డారు. ఆటోమెటిక్‌ సిగ్నల్‌ విధానంలో రెండు చోట్ల లోపాలు ఉన్నాయని కొందరు చెప్తుంటే.. రాయగడ ప్యాసింజర్‌ లోకో పైలెట్‌ హెచ్చరికలు పాటించకుండా వేగంగా వెళ్లడమే.. కారణమై ఉంటుందనేది (Vizianagaram Train Accident Causes) మరో వాదన.

రైలు మార్గాల్లో అన్నిచోట్ల అబ్జల్యూట్‌ బ్లాక్‌ సిస్టమ్‌-ABS ఉంటుంది. అంటే ఒక రైలు తర్వాతి స్టేషన్‌కు చేరుకున్నాకే.. వెనుక స్టేషన్‌లో మరో రైలు కదిలేందుకు అనుమతిస్తారు. మన రాష్ట్రంలోని రైల్వే మార్గాల్లో అత్యధికంగా.. ఇదే విధానం ఇప్పటికీ ఉంది. ఇందులో ఒక భాగం ఇంటర్మీడియట్‌ బ్లాక్‌ విధానం. దీనిలో.. 2 స్టేషన్ల మధ్య ఒక చోట సిగ్నల్‌ పోస్ట్‌ ఉంటుంది. అంటే ఓ స్టేషన్‌లో బయలుదేరిన రైలు మధ్యలో ఉన్న సిగ్నల్‌ పోస్ట్‌ దాటిన తర్వాత.. వెనుక స్టేషన్‌ నుంచి మరొక రైలు కదిలేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారు. కొంతకాలంగా పలు మార్గాల్లో.. ఆటోమెటిక్‌ బ్లాక్‌ సిస్టమ్‌ అమలు చేస్తున్నారు. ఇందులో ఒక స్టేషన్‌కు తర్వాత స్టేషన్‌కు మధ్య ఉండే దూరంలో సగటున ఒకటి నుంచి ఒకటిన్నర కిలోమీటరు దూరానికి ఒకటి చొప్పున.. ఆటోమెటిక్‌ సిగ్నల్‌ పోస్ట్‌ ఉంటుంది.

Andhra Pradesh Train Accident: రైలు ప్రమాదం.. 19 గంటల్లో ట్రాక్​ పునరుద్ధరణ.. కొనసాగుతున్న రాకపోకలు

రైలు ఒక సిగ్నల్‌ పోస్ట్‌ దాటి వెళ్లాక.. వెనుక సిగ్నల్‌ పోస్ట్‌ వద్ద మరొక రైలు బయలుదేరేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ లభిస్తుంది. ప్రస్తుతం.. రైలు ప్రమాదం జరిగిన కొత్తవలస-విజయనగరం మార్గంలోనూ.. ఆటోమెటిక్‌ సిగ్నల్‌ విధానమే ఉంది. కృష్ణా కెనాల్‌ స్టేషన్‌ నుంచి విజయవాడ మీదుగా ముస్తాబాద్‌ స్టేషన్‌ వరకూ.. కేవలం 18 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే ఆటోమెటిక్‌ సిగ్నల్‌ విధానం అందుబాటులో ఉంది. మిగిలిన 110 స్టేషన్ల పరిధిలో.. దాదాపు 60 స్టేషన్లలో A.B.S. ఉంది. మరో 50 స్టేషన్లకు మధ్య దూరం అధికంగా ఉండటంతో ఇంటర్మీడియట్‌ బ్లాక్‌ సిస్టమ్‌ ఉంది.

పసుపు లైట్‌ సిగ్నల్‌ ఉంటే..: సాధారణంగా.. రైళ్ల రాకపోకలకు 4 రకాల సిగ్నల్స్‌ ద్వారా లోకో పైలెట్‌కు సమాచారం చేరుతుంటుంది. పసుపు లైట్‌ సిగ్నల్‌ ఉంటే అప్రమత్తంగా ఉండాలని.. తర్వాత సిగ్నల్‌లో రెడ్, గ్రీన్‌ సిగ్నల్స్‌లో ఏదైనా ఉండొచ్చని అప్రమత్త సందేశం ఇస్తారు. ఇలాంటి సమయంలో.. రైలు గంటకు 10 నుంచి 15 కిలోమీటర్ల వేగంతోనే వెళ్లాలి. 2 పసుపు లైట్లతో సిగ్నల్‌ ఉంటే.. కచ్చితంగా ప్రమాదం అని, తర్వాత సిగ్నల్‌ పోస్టులో రెడ్‌ సిగ్నల్‌ ఉంటుందని హెచ్చరిక.! ఇలా ఉంటే.. లోకో పైలెట్‌ రైలు వేగాన్ని పూర్తిగా నియంత్రించాలి.

AP Train Accident Viral Video: విజయనగరం రైలు ప్రమాద దృశ్యాలు.. చెల్లాచెదురుగా పడి ఉన్న రైలు బోగీలు..

కంటకాపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో (Kankatapalli Train Accident) తొలుత వెళ్తున్న పలాస ప్యాసింజర్‌ సింగిల్‌ ఎల్లో లైట్‌ సిగ్నల్‌ కారణంగా నెమ్మదిగా వెళ్లి.. తర్వాత సిగ్నల్‌కు దగ్గరలో దాదాపు నిలిచిపోయింది. అదే టైమ్​లో.. వెనుక రాయగడ ప్యాసింజర్‌ ఎందుకు వేగంగా వచ్చింది? సిగ్నలింగ్‌లో సాంకేతిక లోపంతో గ్రీన్‌ చూపించిందా?... లేక డబుల్‌ ఎల్లో సిగ్నల్‌ను లోకో పైలెట్‌ గమనించలేదా? అనేది తేలాల్సి ఉంది.

కంటకాపల్లి-అలమండ రైల్వే స్టేషన్ల పరిధిలో 3 లైన్లు ఉన్నాయి. వాటిలో ఎక్కడా క్రాసింగ్స్‌ కూడా లేవు. ఈ మధ్యలో రెండు ఆటోమెటిక్‌ సిగ్నల్‌ పోస్టుల్లో ఆదివారం ఉదయం నుంచి.. బ్లాంక్స్‌ వస్తున్నట్లు గుర్తించారు. దీనిపై కంటకాపల్లి స్టేషన్‌ మాస్టర్‌కూ...సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో అటువైపుగా వెళ్లే రైళ్ల లోకో పైలెట్లను అప్రమత్తం చేశారని.. చెబుతున్నారు. స్టేషన్‌ మాస్టర్‌ వద్ద ఉండే వెరీ హై ఫ్రీక్వెన్సీ సెట్‌ ద్వారా.. తొలుత వెళ్లిన పలాస ప్యాసింజర్‌ లోకో పైలెట్, గార్డ్‌ను అప్రమత్తం చేశారని.. అందుకే ఆ రైలు నెమ్మదిగా వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటువంటి తరుణంలో వెనుక రాయగడ ప్యాసింజర్‌ వేగంగా ఎలా వెళ్లింది అనేది అంతుచిక్కడం లేదు.

Vizianagaram Train Accident: పట్టాలపై బీభత్సం.. కొనసాగుతున్న సహాయ చర్యలు.. ప్రమాదం జరిగిన తీరు ఇలా..

సాధారణంగా గ్రీన్‌ సిగ్నల్‌ ఉన్నపుడు రైలు వంద నుంచి 130 కిలోమీటర్ల వేగంతో.. పరుగులు పెట్టొచ్చు. కానీ ఎల్లో, డబుల్‌ ఎల్లో సిగ్నల్స్‌ ఉంటే మాత్రం స్టాండర్డ్‌ స్పీడ్‌ రెస్ట్రిక్షన్స్‌ పాటించాల్సి ఉంటుంది. అంటే 10నుంచి 15 కిలోమీటర్ల వేగంతోనే వెళ్లాలి. అలా అయితే ఎదురుగా రైలు కనిపిస్తే బ్రేక్‌ వేసి ఆపేందుకు అవకాశం ఉంటుంది. కానీ రాయగడ ప్యాసింజర్‌.. ఈ స్టాండర్డ్‌ స్పీడ్‌ రెస్ట్రిక్షన్‌ పాటించిందా? లేదా? అనేది విచారణ బృందమే తేల్చాలి.

vizianagaram train accident రైలు ప్రమాదంపై నేతల దిగ్భ్రాంతి.. సహాయక చర్యలు చేపట్టాలన్న సీఎం! బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపిన నేతలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.