ETV Bharat / bharat

ఇంజినీర్​ ఇంట్లో విజిలెన్స్ దాడులు, గుట్టలుగా నోట్ల కట్టలు

author img

By

Published : Aug 27, 2022, 7:00 PM IST

బిహార్​కు చెందిన ఇంజనీర్​ సంజయ్ కుమార్​ రాయ్​​ ఇంటిపై విజిలెన్స్ అధికారులు చేసిన దాడుల్లో భారీగా నగదు లభ్యమైంది. ఇప్పటివరకు రూ.5 కోట్లకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

Vigilance Raid in Patna
vigilance raid in patna Raid on the locations of the Executive Engineer

Vigilance Raid in Patna: బిహార్ పట్నాలోని కిషన్​గంజ్​ డివిజన్​ రూరల్​ అఫైర్స్ డిపార్ట్​మెంట్​ ఎగ్జిక్యూటివ్ ​​ఇంజినీర్​ సంజయ్ కుమార్​ రాయ్​​ ఇంటిపై విజిలెన్స్​ డిపార్ట్​మెంట్​ అధికారులు దాడులు నిర్వహించారు. శనివారం ఉదయం దాడులు ప్రారంభించగా.. ఇప్పటివరకు దాదాపు రూ.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. కిషన్​గంజ్​, పట్నా ప్రాంతాల్లో దాడులు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

Vigilance Raid in Patna
సోదాల్లో బయటపడిన నగదు

అయితే, విజిలెన్స్​ అధికారులు దాడులు చేయడానికి వెళ్లినప్పుడు, నిందితుడు అవినీతి సొమ్మును అతని జూనియర్​, క్యాషియర్​ ఇంట్లో దాచే ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న అధికారులు, వారి ఇళ్లలో కూడా దాడులు చేశారు. కిషన్​గంజ్​లో రూ.4 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్నాలో దాదాపు రూ.1 కోటి రూపాయలు దొరికాయి.

Vigilance Raid in Patna
బయటపడ్డ నోట్ల కట్టలు

ఈ కేసులో విజిలెన్స్ అధికారులు దాడులను కొనసాగిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సంజయ్​ కుమార్​ రాయ్​ భూములకు సంబంధించిన దస్తావేజులను, బ్యాంకు లాకర్లను అధికారులు పరిశీలించనున్నారు. ఈ దాడుల్లో చాలా డాక్యుమెంట్లు లభ్యమయ్యాయని, వాటిని పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు.

Vigilance Raid in Patna
సోదాలు నిర్వహిస్తున్న విజిలెన్స్​ అధికారులు
Vigilance Raid in Patna
నోట్ల కట్టలను లెక్కిస్తున్న అధికారులు

ఇవీ చూడండి: ఆ అమ్మాయిలకు మళ్లీ నీట్‌ పరీక్ష, లోదుస్తుల వివాదంతోనే

పెట్టుబడుల పేరుతో ఘరానా మోసం, 27 ఏళ్లు జైలు శిక్ష, రూ 171 కోట్లు ఫైన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.