ETV Bharat / bharat

బావి తవ్వుతుండగా ప్రమాదం.. ఇద్దరు కూలీలు మృతి

author img

By

Published : Apr 10, 2021, 1:11 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ మహోబాలో బావి తవ్వుతుండగా పైనుంచి మట్టి, రాళ్లు పడి ఇద్దరు మరణించారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలైనట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు కులపహాడ్​ తహసీల్దార్​ మహమ్మద్ ఉవైశ్ పేర్కొన్నారు.

Two dead, as many injured in cave-in while digging well in UP's Mahoba
బావి తవ్వుతుండగా మట్టి, రాళ్లు పడి ఇద్దరు మృతి

ఉత్తర్​ప్రదేశ్​ మహోబా జిల్లా అజ్నార్​ స్టేషన్​ పరిధిలోని మహౌబంద్​ గ్రామంలో విషాదం జరిగింది. ఎనిమిది మంది కూలీలు 20 అడుగుల లోతులో బావి తవ్వుతుండగా.. వారిపై మట్టి, రాళ్లు పడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మిగతావారు స్వల్ప గాయాలతో బయపడ్డారు.

మృతులు రామ్​సేవక్ అహిర్వార్​(35), గ్యాసీలాల్​(30)గా గుర్తించినట్లు కులపహాడ్​ తహసీల్దార్​ మహమ్మద్ ఉవైశ్ తెలిపారు. గాయపడ్డవారు ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి : రూ.3 కోట్ల బీమా కోసం.. కారులోనే భర్తను కడతేర్చి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.