బోరు బావిలో పడి చిన్నారి మృతి.. కాపాడేందుకు 19 గంటలు శ్రమించినా..

author img

By

Published : Jun 4, 2023, 8:43 AM IST

Updated : Jun 4, 2023, 9:52 AM IST

three-girl-falls-into-borewell-in-gujarat-rescue-operation-is-going-on

Child Fell In Borewell : గుజరాత్​లోని జామ్​నగర్​ జిల్లాలో మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు బోరుబావిలో​ పడి ప్రాణాలు కోల్పోయింది. చిన్నారిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమించిన అధికారులు.. ఆదివారం పాపను బయటకు తీశారు. అయితే.. చిన్నారి చనిపోయిందని నిర్ధరించారు.

Borewell baby dies : గుజరాత్​లో శనివారం ఉదయం బోరుబావిలో పడ్డ మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పాపను కాపాడేందుకు 19 గంటల పాటు.. తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఘటనపై సమాచారం అందుకుని, వెంటనే రెస్కూ ఆపరేషన్​ చేపట్టిన అధికారులు.. ఆదివారం తెల్లవారుజామున పాపను బయటకు తీశారు. అయితే.. చిన్నారి చనిపోయిందని నిర్ధరించారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జామ్​నగర్​లో జిల్లాలో మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు ఓ బోరుబావిలో​ పడింది. 200 అడుగుల లోతున్న బోరుబావి​లో చిన్నారి పడిపోయినట్లు సమాచారం. 40 అడుగుల లోతులో చిన్నారి చిక్కుకుందని అధికారులు తెలిపారు. తమచన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. చిన్నారి కుటుంబ సభ్యులు ఓ గిరిజన తెగకు చెందిన వారు. వీరంతా స్థానికంగా ఉన్న ఓ వ్యవసాయ పొలంలో పనులు చేస్తున్నారు. అదే సమయంలో ఆ చుట్టుపక్కల ఆడుకుంటున్న చిన్నారి.. ప్రమాదవశాత్తు బోరుబావి​లో పడింది. ఇది గమనించిన చిన్నారి కుటుంబసభ్యులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు.

three girl-falls-into-borewell in gujarat rescue-operation-is going on
చిన్నారి పడ్డ బోరుబావి

borewell baby rescue operation : సమాచారం అందుకున్న అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు.. శనివారం ఉదయం 11 గంటలకు సహాయక చర్యలు ప్రారంభించారు. బోరుబావికి సమాంతరంగా 10 అడుగులు లోతులో గొయ్యి తవ్వి.. పాపను తీసేందుకు ప్రయత్నించారు. సైన్యం కూడా ఈ ఆపరేషన్​కు సాయం అందించింది. చిన్నారికి ఆక్సిజన్​ అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. కెమెరా సాయంతో చిన్నారిని ఉన్న స్థితిని తెలుసుకున్నారు. 108 అంబులెన్స్​ సిబ్బంది, పోలీసులు, ఇతర అధికారులు ఘటనా స్థలంలోనే ఉన్నారు. ఈ ఉదయం 5.45కు పాపను బయటకు తీశారు. అయితే అప్పటికే చిన్నారి ప్రాణాలు విడిచిందని నిర్ధరించారు.

మధ్యప్రదేశ్​ నుంచి బాధిత కుటుంబం వలస..
చిన్నారి తండ్రి లాలుబాయ్​. తల్లి రాంబాయ్​. వీరంతా మధ్యప్రదేశ్​లోని దేవ్​పుర్ గ్రామానికి చెందిన వారు. ఉపాధి కోసం గుజరాత్​కు వలస వచ్చారు. చిన్నారి పేరు రోషిని అని తెలిసింది.

three girl-falls-into-borewell in gujarat rescue-operation-is going on
పాపను కాపాడేందుకు సహాయక చర్యలు

బోరు బావిలో పడి బాలుడు మృతి.. కోతులకు భయపడి పరుగెడుతూ..
కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్​లో హృదయవిదారక ఘటన జరిగింది. బోరు బావిలో పడి ఓ ఏడేళ్ల బాలుడు మృతిచెందాడు. ప్రమాదవశాత్తు 60 అడుగుల బావిలో పడిన బాలుడిని.. అనేక గంటల పాటు సహాయక చర్యలు చేపట్టి బయటకు తీశారు అధికారులు. అనంతరం పిల్లాడ్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాలుడి కుటుంబసభ్యులకు​ రూ.4లక్షల పరిహారం అందజేశారు సీఎం శివరాజ్​ సింగ్ చౌహాన్. పూర్తి వివరాల కోసం ఇక్కడి క్లిక్​ చేయండి.

అంతకు ముందు ఇదే మధ్యప్రదేశ్​లో బేతుల్​ జిల్లాలో బోరు బావిలో పడ్డ ఓ చిన్నారి.. దాదాపు ఐదు రోజులు మృత్యువుతో పోరాడి మృతిచెందాడు. గత ఐదు రోజులుగా జరిగిన రెస్క్యూ ఆపరేషన్​ బాలుడి ప్రాణాలను రక్షించలేకపోయింది. చిన్నారి తన్మయ్​ మృతికి సంతాపం తెలిపిన మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్​ అతడి కుటుంబానికి రూ. 4 లక్షల ఎక్స్​గ్రేషియాను అందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడి క్లిక్​ చేయండి.

Last Updated :Jun 4, 2023, 9:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.