ETV Bharat / bharat

Telugu People Protest in Bengaluru Against Chandrababu Arrest: బెంగళూరులో కదం తొక్కిన ఐటీ ఉద్యోగులు.. రెండోరోజూ ఆగని నిరసనలు

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2023, 4:43 PM IST

Updated : Sep 16, 2023, 5:19 PM IST

Telugu People Protest in Bengaluru Against Chandrababu Arrest: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ బెంగళూరులో తెలుగు ప్రజలు రెండో రోజు ఆందోళనకు దిగారు. వి‍ధాన సౌధ సమీపంలోని ఫ్రీడమ్‌ పార్క్‌వద్ద్ నిరసన ప్రదర్శన చేశారు. తెలుగు సంఘాలు చేస్తోన్న ధర్నాకు ఐటీ ఉద్యోగులు, బెంగళూరు నగర ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి.

telugu_people_protest1
telugu_people_protest1t

Telugu People Protest in Bengaluru Against Chandrababu Arrest: బెంగుళూరులో కదం తొక్కిన ఐడీ ఉద్యోగులు.. రెండోరోజూ ఆగని నిరసనలు

Telugu People Protest in Bengaluru Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ బెంగళూరు ఫ్రీడమ్‌ పార్క్‌ వద్దకు భారీగా తరలివచ్చిన తెలుగు మహిళలు, ఐటీ ఉద్యోగులకు నగరంలోని ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. సైకో పోవాలి సైకిల్‌ రావాలి అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబుకు మద్దతుగా మహిళలు పార్కులో బైఠాయించారు. రాజధాని అమరావతిని నాశనం చేసిన సీఎం జగన్‌.. ఇప్పుడు చంద్రబాబు మీద బురద జల్లాలని ప్రయత్నిస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం బాగుపడాలంటే మళ్లీ చంద్రబాబే అధికారంలోకి రావాలని బెంగళూరు తెలుగు ప్రజలు కోరారు.

Special Medical Team for Chandrababu in Jail: రాజమండ్రి జైలులో చంద్రబాబుకు ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు..

చంద్రబాబు అరెస్టు (Chandrababu Arrest) బాధాకరమని మహిళలు ఆందోళన చెందారు. 16 నెలలు జైల్లో ఉండొచ్చిన సీఎం జగన్‌.. చంద్రబాబును అరెస్టు చేసి సంబరాలు చేసుకుంటన్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తు తరాలు బాగుండాలంటే 2024లో తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. పరదాల చాటున తిరిగే సీఎం జగన్‌కు ప్రజలంటే ఎందుకు అంత భయమని ప్రశ్నించారు. చంద్రబాబు అంటే ఒక విజన్‌ అని చంద్రబాబు అరెస్టుతో ఆయన గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిసేలా సీఎం జగన్‌ చేశారని ఐటీ ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. లోకేశ్‌ పాదయాత్రను అడ్డుకున్న వైసీపీ సర్కారు, ఇప్పుడు చంద్రబాబును అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేయాలని చూస్తోందన్నారు. వచ్చేఎన్నికల్లో వైసీపీ సర్కారుకు తగిన బుద్ధి చెప్పి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని ఐటీ ఉద్యోగులు ఆకాంక్షించారు.

టీడీపీ అధినేత అరెస్టుకు నిరసనగా.. ఆందోళనలు.. వరసగా ఎనిమిదో రోజు

Nara Bhuvaneshwari, Daughter-in-law Brahmani Candle Rally: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టు అక్రమమని నిరసిస్తూ ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. స్థానిక మహిళలతో కలిసి సాయంత్రం 5.30 గంటలకు రాజమండ్రి తిలక్‌ రోడ్డులోని సాయి బాబా ఆలయం దగ్గర నుంచి శ్యామలానగర్‌ రామాలయం జంక్షన్‌ వరకూ.. ఈ ర్యాలీ జరుగనుంది. కొవ్వొత్తుల ర్యాలీకి వివిధ మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా తమ మద్దతు ప్రకటించాయి.

TDP concern on New Central Jail Incharge Ravi Kiran చంద్రబాబు పట్ల కఠినంగా వ్యవహరించేందుకు రవికిరణ్‌ను తీసుకొచ్చారని ప్రచారం

Women Started Silent Protest Against Chandrababu Arrest: కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం గరికపర్రు గ్రామంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మహిళలు మౌన దీక్ష చేపట్టారు. వేధింపులను నిరసిస్తూ గరికిపర్రు గ్రామ తెలుగు మహిళలు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముందుగా గ్రామంలోని ఎన్టీఆర్, హరికృష్ణ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించి అక్కడ నుండి గ్రామంలోని కళ్యాణ మండపం వద్దకు ర్యాలీగా గ్రామస్తులు తరలివచ్చారు. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మహిళలు మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Last Updated : Sep 16, 2023, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.