ETV Bharat / bharat

TDP Leaders Protest in Telangana : చంద్రబాబు అరెస్టుపై గళమెత్తిన తెలంగాణ టీడీపీ నేతలు.. మార్మోగిన నినాదాలు

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2023, 3:57 PM IST

TDP Leaders Protest in Telangana : చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ.. తెలంగాణ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఏపీ ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ.. తెలంగాణ టీడీపీ నేతలు పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా హైదరాబాద్​లో అభిమానులు నిరసనలు చేపట్టారు. శాంతియుత నిరసన చేపట్టిన నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు. చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేశారు.

TDP Leaders Protest in Telangana
TDP Leaders Protes

TDP Leaders Protest in Telangana చంద్రబాబు అరెస్టుపై గలమెత్తిన తెలంగాణ టీడీపీ నేతలు మార్మోగిన నినాదాలు

Telangana TDP Leaders Protest Against Chandrababu Arrest : తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu Arrest) అక్రమ అరెస్టును ఖండిస్తూ.. గచ్చిబౌలి బొటానికల్ గార్డెన్​లో సీనియర్ సిటిజన్ వాకర్స్ ఆధ్వర్యంలో అభిమానులు(Telangana TDP Leaders) నిరసన చేపట్టారు. బొటానికల్ గార్డెన్​లో శాంతియుతంగా ధర్నా చేస్తున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనను అడ్డుకోవటంపై పోలీసులను ప్రశ్నించటంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం వారిని స్టేషన్​కు తరలించారు.

TDP Leaders Protest in Telangana : చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ.. మోతీ నగర్​లో రాజీవ్ నగర్ కాలనీ వాసులు నిరసన చేపట్టారు. తెలుగుదేశం అభిమానులు కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 'సైకో పోవాలి సైకిల్ రావాలి' అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం అభిమానులు... ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించారు.

ఆంధ్రప్రదేశ్ జగన్ సైకోతనంతో రాష్ట్రం పతన వ్యవస్థకు దారితీసిందని.. ముఖ్యమంత్రి జగన్​కు రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని తెలిపారు. చంద్రబాబు కడిగిన ముత్యంవలే బయటకి వస్తారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు తప్పక ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అభిమానులు(TDP Leaders in Telangana) పెద్ద ఎత్తున పాల్గొని.. చంద్రబాబు అరెస్టుపై నిరసన వ్యక్తం చేశారు.

TDP Leaders Protest in Telangana : ఏపీలో చంద్రబాబు అరెస్ట్​.. తెలంగాణలో భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు

Hyderabad IT Professionals Protest Chandrababu Arrest : చంద్రబాబు నాయుడుకు మద్దతుగా.. హైదరాబాద్ ఐటీ ప్రొఫెషనల్స్(Hyderabad IT Professional) ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు. చంద్రబాబు సురక్షితంగా బయటకు రావాలని.. బాచుపల్లిలో సుదర్శన లక్ష్మి గండభేరుండ నరసింహ మహాచండి మృత్యుంజయ కార్యసిద్ధి హోమం జరిపారు. కొల్లూరి కృష్ణమూర్తి, కోటేశ్వరి దంపతుల నేతృత్వంలో కౌసల్య గార్డెన్స్​లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. 32 మంది వేద పండితుల చేత యాగాలను జరిపించారు. (Babutho Memu) 'బాబుతో మేము' సంతకాల సేకరణ కార్యక్రమంలో ఐటీ ఉద్యోగులు, చిన్నారులు పాల్గొన్నారు.

TDP Leaders Protest in Hyderabad : చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా.. మధురానగర్, కూకట్‌పల్లి, వసంత్ నగర్​లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉద్యోగులు, కాలనీ వాసుల ఆందోళన నిర్వహించారు. అక్రమంగా చంద్రబాబు నాయుడుపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మధురవాడలో నిర్వహిస్తున్న 'బాబుతో నేను' కార్యక్రమానికి నందమూరి సుహాసిని సంఘీభావం తెలిపారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో ఆంధ్రప్రదేశ్​లో జగన్ రాజకీయ ప్రస్తావన అంతం ప్రారంభమైనది అని నందమూరి సుహాసిని అన్నారు.

Bandi Sanjay Condemned Chandrababu Naidu Arrest : 'చంద్రబాబును ఏపీ ప్రభుత్వం అరెస్టు చేసిన విధానం సరైంది కాదు'

TDP Leaders Protest in Khammam : ప్రజాస్వామ్యాన్ని రక్షించండి.. చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఖమ్మంలో ఆయన అభిమానులు భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు. శ్రీశ్రీ కూడలి నుంచి వందలాది కార్లతో ఖమ్మం నగరంలోని ప్రధాన రహదారుల్లో ప్రదర్శన నిర్వహించారు. (I am With CBN) 'ఐ యామ్‌ విత్‌ సీబీఎన్‌' అంటూ ప్లకార్డులు, జెండాలు ప్రదర్శించారు. ఖమ్మం నగరానికి చెందిన అన్నీ రాజకీయ పార్టీల నాయకులు.. కార్పొరేటర్లు కార్ల ర్యాలీలో పాల్గొన్నారు.

IT Employees Protest Chandrababu Arrest : ఐటీ ఉద్యోగులకు షాక్.. ఆందోళనలపై పోలీసుల ఆంక్షలు

Twitter Posts on Chandrababu Naidu Arrest : ఈ అరాచకాలు.. ఎన్నాళ్లు.. ఇంకెన్నాళ్లు.. మౌనం వెనక ప్రళయం ఉంది.. గుర్తుపెట్టుకో జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.