ETV Bharat / bharat

Woman Inspiring Story : పది ఫెయిల్​.. యూట్యూబ్​ చూస్తూ నెలకు లక్షల్లో సంపాదన

author img

By

Published : Aug 3, 2023, 2:23 PM IST

swarga balcony makeovers : ప్రతి పేద మధ్య తరగతి కుటుంబాల కల సొంతిల్లు. కష్టపడి కట్టుకున్న సొంతిల్లు, ఇష్టంతో కొనుకున్న ఫ్లాట్​ ఎవరికైనా జీవితాంతం ఒక అపురూపమైన జ్ఞాపకమే కదా..! ఆ ఇంటికి వన్నెలద్దడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవూ. హాల్​, బెడ్​రూం, కిచెన్​ ఇలా అన్ని గదులను రకారకాలుగా డిజైన్ చేసుకుంటాం. కానీ బాల్కనీ, వరండాలను మాత్రం ఖాళీగా వదిలేస్తాం. వాటినెందుకు అందంగా తయారు చేయకూడదు అనుకుని దాన్నే వ్యాపారంగా మార్చకున్నారు రామా హేమలత. ఈ ప్రయాణంలో తను ఎదుర్కొన్న ఇబ్బందులు ఆమె మాటల్లోనే...

Woman Inspiring Story
Woman Inspiring Story

swarga balcony makeovers : ఒంటరితనం మనిషికి చాలా అనుభవాలను రుచి చూపిస్తుంది. నాకేమో వ్యాపార పాఠాలను నేర్పించింది. పుట్టి పెరిగింది అంతా వరంగల్​లోనే. పది ఫెయిల్​, రెండు సంవత్సరాలు పట్టింది పాస్​ అవ్వడానికి. తర్వాత ఇంకెముంది పెళ్లైంది. మా ఆయన లక్ష్మీనారయణ. నాకు 19 ఏళ్లకే పాప. మంచి భర్త.. కన్నకూతురు కన్నా బాగా చూసుకునే అత్తమామలు. గీసుకొండలో ఇన్సులేటర్స్​ తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. ఏ లోటూ లేదూ కాబట్టి ఏదైనా పనిచేయాలన్న ఆలోచన ఎప్పుడూ తట్టలేదు.

అన్ని అనుకున్న తానే వెళ్తా అంటే అర్థం కాలే : వంటిల్లే నాకు ప్రపంచంలా ఉండేది. కానీ ఏడేళ్ల క్రితం నా భర్త చనిపోయారు. తర్వాత అమ్మానాన్నల్నీ కోల్పోయా.. అది తట్టుకోవడం చాలా కష్టమైంది. ఇంకా మా అమ్మాయి చదువుకోసం హైదరాబాద్​ వచ్చేశాం. ఇక్కడికి వచ్చాక అనిపించింది ఏదైనా వ్యాపారం చేస్తే బాగుంటుంది అని. అప్పుడే సన్నిహితుల సలహా మేరకు స్కూల్​ ఫ్రాంచైజీ తీసుకున్నా. చేయగలనని నమ్మకం వచ్చాకనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నా. కానీ స్కూల్ నిర్వహణలో అనుకోని చాలా సవాళ్లు ఎదురయ్యాయి.

balcony makeovers hyderabad : అన్ని ఒక్కొక్కటిగా తెలుసుకున్నా. ఒక దారిలో పడుతుందన్న సమయానికి కరోనా వచ్చి అతలాకుతలం చేసింది. 2020లో బీటెక్ పూర్తయ్యాక పేస్ట్రీ బేకింగ్​, మేకింగ్​లో శిక్షణ తీసుకోవడానికి అమెరికా వెళ్తా అంది మా అమ్మాయి. అయిన వారందరినీ పోగొట్టుకుని తనే ప్రపంచంగా బతుకుతున్న నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. అలా అని నా స్వార్థం కోసం తన భవిష్యత్​ను ఆపేయడం సరికాదనిపించి సరే అన్నాను.

swarga balcony makeovers founde Hemalatha : ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఏమీ తోచేది కాదు. అప్పుడే మొక్కల పెంపకంపై ధ్యాస పడింది. యూట్యూబ్​లో వీడియోలు చూసి మా బాల్కనీని అచ్చం అలానే తీర్చిదిద్దాలనుకున్నా. మేకోవర్స్​కు సంబంధించిన ప్రతిదీ తెలుసుకున్నాను. మూడు నెలల తర్వాత మా బాల్కనీ స్వర్గంలా అనిపించింది. ఒక్కరు బాగుంది అని చెప్పినా చాలనుకున్నా. ఇరుగు, పొరుగువారంతా చూసి ఫిదా అయ్యారు. అప్పుడు అనిపించింది దీన్నే వ్యాపారంగా మార్చాలనీ. ఇంట్లో వాళ్లతో చెబితే ఎందుకమ్మా నీకు ఇవన్నీ హాయిగా ఉండకా అని అన్నారు. కొందరైతే బాల్కనీ మేకోవర్సా... ఏ వాళ్ల మొక్కలు వాళ్లు తెచ్చుకోలేరా..? కుండీల్లో మట్టి పోసి ఇవ్వడానికి నిన్ను సపరేట్​గా నియమించుకుంటారా అంటూ హేళనగా మాట్లాడేవారు 2021లో " స్వర్గ బాల్కనీ మేకోవర్స్​"ను ప్రారంభించాను. మరిది పిల్లల సాయంతో ఇన్​స్టాగ్రామ్​లో వీడియోలు ఎలా చేయాలో నేర్చుకున్నా. రెండేళ్లలో రెండున్నర లక్షల మంది ఫాలోవర్స్​ను సంపాదించాను.

లక్షల్లో ఆదాయం : నా మొదటి పెట్టుబడి రూ.50వేలు. ప్రస్తుతం నెలకు లక్షల్లో ఆదాయం వస్తోంది. బాల్కినీ మేకోవర్సే కాకుండా ఇంటీరియర్​ డిజైనింగ్​, పార్లర్స్​, విల్లాలు. స్టూడియో వర్క్స్​ మొదలైనవి చేస్తున్నా. 20మంది వరకు నా సంస్థలో పనిచేస్తున్నారు. ఇన్​స్టాగ్రామ్​లో వీడియోలు చూసి నటి దివి తన స్టూడియోని డెకరేట్​ చేయమని కోరింది. దాంతో నిహారిక కొణిదెల, శ్రీముఖి, మెహబూబ్​ల స్టూడియోలు, ఇళ్లు డిజైన్​ చేశా. నేను సొంతంగా నేర్చుకున్న దాన్ని ఆన్​లైన్​, ఆఫ్​లైన్​ వేదికగా ఔత్సాహికులకు శిక్షణా ఇవ్వాలనే ఆశయంతో ముందుకు అడుగులు వేస్తున్నా.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.