ETV Bharat / bharat

ఒకే కుటుంబంలో మూడు తరాలు బలి.. తమ్ముడిని కాపాడబోయి అన్న కూడా.. కొండచరియల వల్ల మొత్తం 60 మంది మృతి

author img

By

Published : Aug 16, 2023, 6:05 PM IST

Shimla Landslide Temple : హిమాచల్​ ప్రదేశ్​లో భారీ వరదలు, కొండచరియలు సృష్టించిన బీభత్సానికి మృతుల సంఖ్య 60 దాటింది. ప్రస్తుతం శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసే ప్రక్రియ కొనసాగుతోంది. వరదల్లో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు శివాలయంపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒక కుటుంబంలో ఐదుగురు మరణించగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు.

Shimla Landslide Temple
శివాలయంపై విరిగిపడ్డ కొండచరియలు

Shimla Landslide Temple : హిమాచల్​ ప్రదేశ్​లో కొండచరియలు విరిగిపడిన ఘటనలు అనేక కుటుంబాల్లో తీరని వేదనను మిగిల్చాయి. ఓ కుటుంబంలో మూడు తరాలను బలి తీసుకోగా.. మరో కుటుంబం ఇద్దరు కుమారులను కోల్పోయింది. ఇప్పటి వరకు భారీ వరదలు, కొండచరియలు సృష్టించిన బీభత్సానికి సుమారు 60 మందికి పైగా మరణించారు. ప్రస్తుతం శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసే ప్రక్రియ కొనసాగుతోంది.

Shimla Landslide Death Toll : సోమవారం సమ్మర్​ హిల్​ శివాలయంపై విరిగిపడిన కొండచరియలు ఓ కుటుంబంలో మూడు తరాలను బలి తీసుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి ఐదుగురు మరణించగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. పవన్​ శర్మ అనే వ్యక్తితో పాటు అతడి భార్య సంతోష, కుమారుడు అమన్​, కోడలు అర్చన, ముగ్గురు మనవరాళ్లు సోమవారం శివాలయానికి వెళ్లారు. ఒక్కసారిగా కొండచరియలు శివాలయంపై విరిగిపడడం వల్ల వారంతా గల్లంతయ్యారు. ఇందులో ఐదుగురి మృతదేహాలను వెలికితీయగా.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. మిగిలిన వారిని ఎలాగైనా గుర్తించాలని మృతుల బంధువులు కోరుతున్నారు. వారి కోసం మూడు రోజులుగా ఎదురు చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 13 మృతదేహాలను వెలికితీశారు.

Shimla Landslide Temple
గల్లంతైన వారి ఫొటోను చూపిస్తున్న బంధువు

తమ్ముడిని రక్షించబోయి అన్న మృతి
మరోవైపు ఫాగ్లిలో విరిగిపడిన కొండచరియలు ఒకే కుటుంబంలో ఇద్దరు సోదరుల ప్రాణాలను బలి తీసుకుంది. శిథిలాల కింద చిక్కుకుని ఆపదలో ఉన్న సోదరుడిని కాపాడేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు ఓ న్యూస్​ రీడర్​. సలావుద్దీన్​ బాబర్​ అనే వ్యక్తి ఆకాశవాణిలో న్యూస్ రీడర్​గా పనిచేస్తున్నాడు. రోజూలాగే సోమవారం ఉదయాన్నే ఇంట్లో పనుల్లో నిమగ్నం కాగా.. ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన సలావుద్దీన్​ బయటకు వచ్చాడు. కానీ అతడి సోదరుడు శిథిలాల్లో చిక్కుకుపోయాడు. దీనిని గమనించిన సలావుద్దీన్​ వెంటనే అక్కడికి చేరుకుని సోదరుడిని కాపాడే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే మరోసారి కొండచరియలు విరిగిపడడం వల్ల సలావుద్దీన్ సైతం శిథిలాల్లో కూరుకుపోయాడు. అనంతరం అధికారులు సహాయక చర్యలు చేపట్టగా సోదరులు ఇద్దరూ శవాలుగా కనిపించారు. ఈ ప్రమాదంలో వీరితో సహా ఐదుగురు మరణించారు.

  • शिमला के फागली लैंडस्लाइड में आकाशवाणी शिमला की खूबसूरत आवाज़,बाबर खान( सलाउद्दीन खान)की
    दुःखद मौत-आकाशवाणी परिवार की तरफ से सलाउद्दीन खान को विनम्र श्रद्धांजलि । @airnewsalerts @Anurag_Office @CMOFFICEHP @SukhuSukhvinder pic.twitter.com/NxIq0sI3GM

    — AIR News Shimla (@airnews_shimla) August 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Himachal Pradesh Flood News 2023 : మరోవైపు హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలు సృష్టించిన బీభత్సంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాజధాని శిమ్లాలోని సమ్మర్ హిల్స్, కృష్ణా నగర్, ఫాగ్లి ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన చోట్ల మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఈ మూడు ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. సమ్మర్ హిల్స్‌లో బుధవారం మరో మృతదేహాన్ని వెలికితీశారు. సమ్మర్‌ హిల్స్‌లో మొత్తం 21 మృతదేహాలను గుర్తించిన సహాయ సిబ్బంది.. ఫాగ్లిలో ఐదు, కృష్ణానగర్‌లో రెండింటిని వెలికితీశారు. కొండచరియలు విరిగిపడడం వల్ల సోమవారం కూలిపోయిన ఆలయంలో.. చాలామంది సజీవ సమాధి అయ్యారు. కృష్ణానగర్‌లో మంగళవారం కొండచరియలు విరిగిపడి 8 ఇళ్లు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సోలన్‌ జిల్లాలో భారీ వర్షాలకు ఏడుగురు మరణించారు. వరదల్లో చిక్కుకున్న సుమారు 800 మందిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ముఖ్యమంత్రి సుఖ్విందర్‌సింగ్‌ విడుదల చేశారు.

Himachal Pradesh Flood Death Toll : వరదలు, కొండచరియలు విరిగిపడి ఇప్పటివరకు 60 మంది( Himachal Death Toll ) ప్రాణాలు కోల్పోయినట్లు హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ప్రకటించారు. వరదల కారణంగా అపార నష్టం వాటిల్లిందని చెప్పిన ఆయన.. పునరుద్ధరణ పనులకు కొంత సమయం పడుతుందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించిన సీఎం.. యుద్ధప్రాతిపదికన సహాయ, పునరావాస చర్యలు చేపట్టినట్లు వివరించారు. రాష్టమంతటా ఈ నెల 19 వరకు విద్యాసంస్థలకు సెలవులిచ్చారు. హిమాచల్‌ ప్రదేశ్‌ విశ్వవిద్యాలయంలోనూ తరగతులను నిలిపేశారు. కొండచరియలు విరిగిపడడం వల్ల సుమారు 1200 రహదారులు దెబ్బతిన్నాయని, 400 రహదారులను పునరుద్ధరించినట్లు సీఎం తెలిపారు. కొండచరియలు విరిగిపడిన చోట్ల శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

మరోవైపు హిమాచల్ ప్రదేశ్​తో పాటు ఉత్తరాఖండ్​లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్​లో గత మూడు రోజుల్లో సాధారణం కంటే 157 శాతం అధిక వర్షపాతం నమోదైంది. సమ్మల్‌ హిల్స్ ప్రాంతంలో.. కొండచరియలు ఓ ఇంటిపై పడ్డాయి. మరికొన్ని ప్రాంతాల్లోనూ కొండచరియలు విరిగిపడగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

హిమాచల్​, ఉత్తరాఖండ్​లపై వరుణుడి ప్రకోపం.. 157 శాతం అధికంగా వర్షాలు.. 800 మంది..

హిమాచల్​లో ఆగని వరద విలయం.. 53కు మృతుల సంఖ్య.. శివాలయం శిథిలాల కిందే మరో 10 మంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.