ETV Bharat / bharat

కునో పార్క్ నుంచి పారిపోయిన మరో చీతా.. భయాందోళనల్లో స్థానికులు

author img

By

Published : Apr 5, 2023, 10:39 PM IST

కునో నేషనల్ పార్క్ నుంచి ఇటీవలే తప్పించుకుపోయిన ఒబాన్​ తీసుకురాగానే మరో చీతా నిర్దేశిత ప్రాంతం దాటిపోయింది. ఆశా అనే చీతా కూనో నేషనల్​ పార్కులోని రిజర్వ్​ ఫారెస్ట్ దాటి వీర్​పుర్​ ప్రాంతంలోని బఫర్​ జోన్​లోని వెళ్లిపోయింది.

cheetah in kuno national park
cheetah in kuno national park

నమీబియా నుంచి తీసుకొచ్చిన ఆఫ్రికన్​ జాతి చీతాలు నిర్దేశిత ప్రాతం దాటి బయటకు వెళ్తున్నాయి. ఇటీవలే తప్పించుకుపోయిన ఒబాన్​ తీసుకురాగానే మరో చీతా నిర్దేశిత ప్రాంతం దాటిపోయింది. ఆశా అనే చీతా కూనో నేషనల్​ పార్కులోని రిజర్వ్​ ఫారెస్ట్ దాటి వీర్​పుర్​ ప్రాంతంలోని బఫర్​ జోన్​లోని వెళ్లిపోయింది. ఆశా ఎక్కువగా బఫర్ జోన్​లోని నదుల వెంట సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కాగా ఆశాకు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఆ పేరు పెట్టారు.

అయితే, ఈ చీతాల వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదని అటవీ అధికాలు చెబుతున్నారు. చీతాలు జంతువులను వేటాడవని.. జనసంచారం ఉన్న ప్రాంతాల్లో సంచరించవని తెలిపారు. కానీ బఫర్​ జోన్​ పరిధిలోని గ్రామాల ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

అంతకుముందు కూడా నమీబియా నుంచి తీసుకొచ్చిన ఆఫ్రికన్‌ జాతి చీతాల్లో ఒకటి నిర్దేశిత ప్రాంతం దాటి వెళ్లింది. ఒబాన్‌ అనే చీతా కూనో నేషనల్‌ పార్కుకు 20 కిలోమీటర్ల దూరంలోని బరోడా గ్రామంలో ప్రత్యక్షమైంది. అక్కడి పొలాల్లో చీతా దాక్కున్నట్లు స్థానికులు గుర్తించారు. ఇటీవలే ఆ చీతాను కూనో నేషనల్‌ పార్కు నుంచి ఫ్రీ ఎన్‌క్లోజర్‌లోకి మార్చారు. చీతా జాడ కనిపించకపోవడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు.

నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాల్లో.. ఇప్పటి వరకు నాలుగింటిని కూనో నేషనల్‌ పార్కు నుంచి ఫ్రీ ఎన్‌క్లోజర్లలోకి విడిచిపెట్టారు. ఒబాన్‌, ఆశాను మార్చి 11న విడిచి పెట్టగా.. ఫ్రెడ్డీ, ఎల్టల్‌ను మార్చి 22న విడిచిపెట్టారు. కాగా ఒబాన్​ అడవి నుంచి తప్పిపోయి.. జనావాసాల్లోకి చొరబడినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ప్రజలు భయాందోళన గురయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన అటవీ అధికారులు అనేక ప్రయత్నాల అనంతరం ఒబాన్​ను సురక్షితంగా కూనో నేషనల్​ పార్కుకు తీసుకువచ్చారు.

దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలు..
ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలు మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్క్‌కు తీసుకువచ్చారు. వాటిలో ఏడు మగ, అయిదు ఆడ చీతాలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా జోహన్నెస్‌బర్గ్‌ నుంచి దాదాపు పది గంటల ప్రయాణం చేసి గ్వాలియర్ ఎయిర్‌ ఫోర్స్ స్టేషన్‌కు చీతాలు చేరుకున్నాయి. ఆ తర్వాత భారత వాయుసేన హెలికాప్టర్‌లలో కునో జాతీయ పార్క్‌నకు వాటిని తరలించారు. మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్ చౌహన్‌, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్‌, భూపేంద్ర యాదవ్ కునో జాతీయపార్కులో సిద్ధం చేసిన క్వారంటైన్ ఎన్‌క్లోజర్లలోకి చీతాలను విడిచిపెట్టారు.

7 దశాబ్దాల తర్వాత మొదటిసారి!
70 ఏళ్ల తర్వాత భారత గడ్డపై ఇటీవలే చీతాలు మళ్లీ జన్మించాయి. నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాల్లో ఒక దానికి నాలుగు పిల్లలు జన్మించాయి. ఈ విషయాన్ని పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ట్విట్టర్‌ వేదికగా చెప్పారు. దీంతో పాటుగా ఆ చీతాకు సంబంధించి వీడియో, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. చీతా నాలుగు పిల్లలకు జన్మనివ్వడంపై సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా.. నమీబియా నుంచి తీసుకువచ్చిన 8 చీతాల్లో ఒకటి ఇటీవలే కిడ్నీ సంబంధిత వ్యాధి కారణంగా మరణించింది.

ఇవీ చదవండి : కలెక్టర్​ ఆస్తులు జప్తునకు కోర్టు ఆదేశం.. 40 ఏళ్లుగా న్యాయ పోరాటం

కలెక్టర్​ ఆస్తులు జప్తునకు కోర్టు ఆదేశం.. 40 ఏళ్లుగా న్యాయ పోరాటం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.