ETV Bharat / bharat

లాలూ కుటుంబానికి బెయిల్​.. లడ్డూల కోసం ఎమ్మెల్యేల ఫైట్​

author img

By

Published : Mar 15, 2023, 1:40 PM IST

Updated : Mar 15, 2023, 3:20 PM IST

రైల్వేలో ఉద్యోగాల కుంభకోణం కేసులో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన భార్య రబ్రీదేవి, కూతురు మిసా భారతికి దిల్లీ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఇక ఈ కేసులో లాలూ కుటుంబ సభ్యులకు బెయిల్​ రావడంపై ఆర్​జేడీ ఎమ్మెల్యేల సంబరాలు ఘర్షణకు దారితీశాయి. అసెంబ్లీ ఆవరణలో ఆర్​జేడీ, బీజేపీ సభ్యులు గొడవపడ్డారు.

Lalu Prasad Yadav Family Got Bail
లాలూ ప్రసాద్​ కుటుంబానికి బెయిల్

రైల్వే ఉద్యోగాల భూ కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్​​ కుటుంబ సభ్యులు సహా మరికొంత మందికి దిల్లీ న్యాయస్థానం బుధవారం బెయిల్​ మంజూరు చేసింది. వీరిలో లాలూ భార్య బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవీ, కుమార్తె మీసా భారతి ఉన్నారు.
2004 నుంచి 2009 మధ్య లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే ఉద్యోగాలకు భూములు తీసుకున్నారని సీబీఐ లాలూ కుటుంబంపై అభియోగాలు మోపింది. ఉద్యోగాలు పొందిన వారు లాలూ కుటుంబసభ్యులకు భూములు కానుకగా, అలాగే అతి తక్కువ ధరకు విక్రయించారని సీబీఐ ఆరోపించింది. ఈ కేసులో సీబీఐ కోర్టు ఆదేశాల మేరకు దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు లాలూ, రబ్రీదేవి, మిసా భారతి బుధవారం హాజరయ్యారు. ఇటీవలే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న లాలూ ప్రసాద్‌(74) ఉదయం 10 గంటలకు వీల్‌ఛైర్‌లో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ ముందు హాజరయ్యారు. ఒక్కొక్కరికీ రూ.50,000 చొప్పున వ్యక్తిగత పూచీకత్తుపై వారికి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే ఇదంతా రాజకీయ ప్రేరేపితమైన కేసని ఆర్జేడీ ఆరోపిస్తోంది. బీజేపీ చెప్పినట్లే సీబీఐ ఆడుతోందని విమర్శించింది.

ఈ కేసులో లాలూ కుటుంబ సభ్యులకు బెయిల్​ రావడంపై ఆర్​జేడీ ఎమ్మెల్యేల సంబరాలు ఘర్షణకు దారితీశాయి. తమ అధినేతకు బెయిల్ మంజూరు కావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ పట్నాలోని శాసనసభ ప్రాంగణంలో రాష్ట్రీయ జనతా దళ్​ సభ్యులు లడ్డూలు పంచిపెట్టారు. అయితే ఇదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలతో వారికి గొడవ జరిగింది. ఇరు వర్గాలు తోపులాటకు దిగాయి. ఆర్​జేడీ ఎమ్మెల్యేలు బలవంతంగా తమకు లడ్డూలు తినిపించి, ఇబ్బంది పెట్టారని బీజేపీ శాసనసభ్యులు ఆరోపించారు.

  • #WATCH | Bihar: RJD & BJP MLAs enter into a scuffle with each other over distribution of laddus at Assembly premises following the bail granted to Lalu Yadav, Rabri Devi & Misa Bharti in land-for-job case.

    BJP alleges that RJD MLAs tried to forcefully feed them & disturbed them pic.twitter.com/Fw3PVCZh8N

    — ANI (@ANI) March 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రైల్వేలో అక్రమ నియామకాలు జరిగాయని, రిక్రూట్‌మెంట్ కోసం భారతీయ రైల్వే నిర్దేశించిన పలు నిబంధనలు, విధివిధానాలను లాలూ కుటుంబం ఉల్లంఘించిందని సీబీఐ కోర్టుకు సమర్పించిన చార్జ్ షీట్‌లో పేర్కొంది. రైల్వే ఉద్యోగ అభ్యర్థులు క్విడ్ ప్రోకో కింద నేరుగా లేదా లాలూ సమీప బంధువులు, కుటుంబ సభ్యుల పేర్ల మీద మార్కెట్​ ధర కంటే ఐదో వంతు వరకు ధరలను తగ్గించి అతి తక్కువ మొత్తానికి భూమిని అమ్మినట్లుగా సీబీఐ అధికారులు ఆరోపిస్తున్నారు. నిందితుల జాబితాలో సెంట్రల్ రైల్వే మాజీ జనరల్ మేనేజర్ సౌమ్య రాఘవన్, రైల్వే మాజీ సీపీఓ కమల్ దీప్ మైన్‌రాయ్​లు ఉన్నారు. వీరితో పాటు ఏడుగురు అభ్యర్థులు, నలుగురు ప్రైవేట్ వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయి. లాలూ ప్రసాద్‌తో పాటు ఇతరులపై జరిగిన ప్రాథమిక విచారణ ఆధారంగా కేసు నమోదు చేసినట్లు సీబీఐ ఛార్జిషీట్​లో పేర్కొంది.

లాలూ కుటుంబ సభ్యులు సహా ఈ కేసులో నిందితులుగా ఉన్న మరికొంత మందిని మార్చి 15న కోర్టుకు హాజరుకావాలని ప్రత్యేక న్యాయమూర్తి ఫిబ్రవరి 27న సమన్లు జారీ చేశారు. ఈ కేలులో నేరపూరిత కుట్ర, అవినీతి నేరాలకు సంబంధించి గతేడాది అక్టోబర్‌ 10న 16 మంది నిందితులపై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు సీబీఐ అధికారులు. కాగా, ఈ కేసు తదుపరి విచారణను మార్చి 29కి వాయిదా వేసింది కోర్టు.

Last Updated :Mar 15, 2023, 3:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.