ETV Bharat / bharat

కుప్పకూలిన ట్రైనీ విమానం.. పైలట్​ మృతి.. గుడి గోపురానికి ఢీకొట్టడం వల్లే!

author img

By

Published : Jan 6, 2023, 9:11 AM IST

Updated : Jan 6, 2023, 11:40 AM IST

పైలట్ల శిక్షణ కోసం ఉపయోగించే ట్రైనింగ్​ ప్లేన్​ కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్​ మృతి చెందగా.. ట్రైనీ తీవ్రంగా గాయపడ్డాడు. మధ్యప్రదేశ్​లో జరిగిందీ ప్రమాదం.

Trainee plane crashed in Rewa
Trainee plane crashed in Rewa

మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం జరిగింది. రీవా నగరంలోని ఎయిర్​స్ట్రిప్​పై ఓ ట్రైనింగ్​ ప్లేన్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో పట్నాకు చెందిన కెప్టెన్​ విమల్​ కుమార్​(50) ప్రాణాలు కోల్పోగా.. జైపుర్​కు చెందిన సోను యాదవ్​(23) తీవ్ర గాయాలతో బయటపడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి వచ్చారు. గాయపడ్డ వారిద్దరిని ఆస్పత్రికి తరలించారు. పైలట్​కు తీవ్ర గాయాలు కావడం వల్ల పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతిచెందాడు. చోర్​హటా పోలీస్​స్టేషన్​ పరిధిలోని ఉమ్రీ గ్రామంలో ఓ ఆలయ గోపురానికి ప్లేన్​ ఢీకొట్టడం వల్లే.. ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదం గురువారం రాత్రి 11.30 గంటలకు జరిగినట్టు సమాచారం. ఘటనాస్థలికి అధికారులు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్లేన్ పల్టాన్​ ట్రైనింగ్​ కంపెనీకి చెందినదిగా సమాచారం.

Trainee plane crashed in Rewa
కూలిపోయిన ట్రైనీ విమానం
Trainee plane crashed in Rewa
కూలిపోయిన ట్రైనీ విమానం
Last Updated : Jan 6, 2023, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.