ETV Bharat / bharat

రాహుల్​ హామీల వర్షం.. రైతులకు రూ.3 లక్షల వరకు రుణమాఫీ

author img

By

Published : Sep 5, 2022, 5:24 PM IST

Updated : Sep 5, 2022, 5:54 PM IST

Rahul Gandhi Ahmedabad : ఎన్నికలు సమీపిస్తున్న వేళ గుజరాత్​లో.. కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ హామీలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ. 3 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. భాజపా.. వ్యాపారవేత్తలకు కొమ్ముకాస్తుందని, రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

RAHUL g
rahul gandhi promises to gujarath people

Rahul Gandhi Ahmedabad : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆ రాష్ట్రంలో హామీల వర్షం కురిపించారు. గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రంలో రైతులకు 3 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం వెయ్యి రూపాయలుగా ఉన్న వంటగ్యాస్‌ సిలిండర్‌ను 500 రూపాయలకే అందిస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తామన్నారు. పాల ఉత్పత్తిదారులకు లీటరుకు రూ.5 సబ్సిడీ ఇస్తామన్నారు. బాలికలకు ఉచిత విద్య అందిస్తామన్నారు.బాలికలకు ఉచిత విద్య అందిస్తామన్నారు. సాధారణ వినియోగదారులకు 300 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు.

అహ్మదాబాద్‌లో పరివర్తన్‌ సంకల్ప్‌ ర్యాలీలో పాల్గొన్న రాహుల్‌ ఈ హామీలు గుప్పించారు. అధికారంలోకి వస్తే 10 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామని చెప్పారు. 3 వేల ఆంగ్ల మాద్యమ పాఠశాలలు నిర్మిస్తామని.. బాలికలకు ఉచిత విద్య అందిస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు. "భాజపా ప్రభుత్వం బడా వ్యాపారవేత్తలకు మాత్రమే రుణమాఫీ చేస్తుంది. రైతులకు చేసిందని ఎప్పుడైనా విన్నారా" అని రాహుల్​ గాంధీ ప్రశ్నించారు.

భాజపాపై తీవ్ర స్థాయిలో ధ్వజం..
భాజపా.. ప్రపంచంలోకెల్లా అతిపెద్దదైన సర్దార్​ వల్లభాయ్​ పటేల్​ విగ్రహం నిర్మించిందని రాహుల్​ గాంధీ అన్నారు. కానీ పటేల్​ ఎవరి కోసమైతే పోరాడారో, ఏ ప్రజల కోసమైతే తన ప్రాణాలను అర్పించారో వారికే అది వ్యతిరేకంగా పనిచేసిందని ధ్వజమెత్తారు. భాజపా ప్రవేశ పెట్టి రద్దు చేసిన వ్యవసాయ చట్టాలు.. రైతుల హక్కుల్ని కాలరాసేలా ఉన్నాయన్నారు. గుజరాత్​లోని ప్రతి సంస్థను భాజపా స్వాధీనం చేసుకుందని.. ఇక్కడ యుద్ధం రెండు పార్టీల మధ్య కాదు, అధికార పక్షం స్వాధీనం చేసుకున్న ప్రతి సంస్థతో అని ఆయన ఆరోపించారు.

ఇటీవల పట్టుబడిన డ్రగ్స్​ విషయంలో, ముఖ్యంగా ముంద్రా పోర్టులో పట్టుబడిన డ్రగ్స్ విషయంలో ప్రభుత్వాన్ని తూర్పారపట్టారు. గుజరాత్​ మోడల్ అంటే ఇద్దరు ముగ్గురు వ్యాపార వేత్తల పాలన మాత్రమేనని ఎద్దేవా చేశారు. వ్యాపారవేత్తలకు మాత్రం ఎంత కావాలంటే అంత భూమి కేటాయిస్తారు.. కానీ పేదలు, ఆదివాసీలు చేతులు జోడించి కొద్ది భూమి ఇవ్వమని వేడుకున్నా.. అది వారికి లభించదు అని మండిపడ్డారు.
ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆప్​ అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్​ కూడా తన అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. అధికారంలోకి వస్తే చేస్తామని కొన్ని తాయిలాలు కూడా ప్రకటించారు.

ఇవీ చదవండి: విశ్వాస పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్​.. సభ నుంచి భాజపా వాకౌట్​

కేజ్రీ ప్రమాణస్వీకార వేదికపై ఎవరెవరో తెలుసా

Last Updated : Sep 5, 2022, 5:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.