ETV Bharat / bharat

నటి హత్య కేసులో ట్విస్ట్.. భర్త అరెస్ట్.. దొంగల పని కాదట!

author img

By

Published : Dec 29, 2022, 3:31 PM IST

Updated : Dec 29, 2022, 7:12 PM IST

దుండగుల కాల్పుల్లో మరణించిన యూట్యూబర్​ రియా కుమారి హత్య కేసు అనూహ్య మలుపు తిరిగింది. హత్య​ వెనుక ఆమె భర్త హస్తం ఉందని గుర్తించిన పోలీసులు అతడ్ని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

Jharkhand actress Riya Kumari  death
Jharkhand actress Riya Kumari

ఝార్ఖండ్​కు చెందిన యూట్యూబర్ ​రియా కుమారి హత్య కేసు ఊహించని ట్విస్ట్​ తిరిగింది. ఈ మర్డర్​ వెనుక ఆమె భర్త ప్రకాశ్ హస్తం ఉందని గుర్తించిన పోలీసులు అతడ్ని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. ప్రాథమిక విచారణలో బయటపడ్డ విషయాలకు, తదుపరి దర్యాప్తులో అతని మాటలకు ఎటువంటి పొంతన లేదని చెప్పారు. అయితే.. శవ పరీక్ష నివేదిక​ వచ్చేంత వరకు ఎటువంటి నిర్ణయానికి రాలేమని తెలిపారు.

వాస్తవానికి రియా.. ప్రకాశ్​కు రెండవ భార్య. వారిద్దరి సంబంధాన్ని సమ్మతించిన మొదటి భార్య ప్రస్తుతం తన తండ్రి ఇంట్లో ఉంటోంది. ఇటీవలే రియా పేరు మీద ప్రకాశ్​ భారీ మొత్తంలో ఇన్సూరెన్స్​ చేసినట్లు సమాచారం. అయితే హత్య జరిగిన తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని పోలీసులు తెలిపారు.
రియా కారులో ఉన్నప్పుడు ఆమెను దుండగులు హత్య చేసినట్లుగా భర్త తెలిపాడు. అయితే అక్కడ ఎటువంటి రక్తపు మరకలు కనిపించలేదు. మరోవైపు దుండగులకు, వారికి మధ్య చిన్నపాటి గొడవ జరిగిందని ప్రకాశ్​ తెలిపాడు. దానికి సంబంధించి కూడా దాఖలాలు లేకపోవడం వల్ల పోలీసులు మరో కోణంలో దర్యాప్తు చేపట్టారు. ప్రకాశ్​ను అరెస్టు చేశారు.

నటి రియా గత 10 సంవత్సరాలుగా నాగ్‌పురి, భోజ్‌పురి చిత్రాలలో నటిస్తున్నారు. ఆమెకు సంబంధించిన చాలా ఆల్బమ్‌లు నాగ్​పురి భాషలో భారీ విజయాలు సాధించాయి. అలియా జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లా వాసి. ప్రస్తుతం ఆమె రాంచీలోని బరియాతు టాగోర్ హిల్‌లో ఉన్న తారామణి అపార్ట్‌మెంట్‌లోని ఉంటున్నారు. రియాకు కొత్త చిత్రం కోసం ఆఫర్ వచ్చింది. ఆ చిత్ర నిర్మాతలు కోల్‌కతాకు చెందినవారు. అందుకే ఆమె భర్త, కుమార్తెతో కలిసి సినిమా కోసం దుస్తులు కొనడానికి కోల్‌కతాకు వెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇదీ చదవండి:

ప్రేయసితో కలిసి హోటల్​కు వెళ్లిన యువకుడి అనుమానాస్పద మృతి

రెండో భర్తతో వీడియో కాల్.. కోపంతో హత్య చేసిన మూడో భర్త

Last Updated : Dec 29, 2022, 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.