ETV Bharat / bharat

'కాంతార' సీన్​ రిపీట్​.. అందరూ చూస్తుండగానే చనిపోయిన ఆలయ ప్రధాన పూజారి!

author img

By

Published : Jan 8, 2023, 12:10 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'కాంతార' సినిమాలోని ఓ సీన్​ లాంటి ఘటన కర్ణాటకలో తాజాగా జరిగింది. 500 ఏళ్ల క్రితం నాటి ఆలయ విషయంలో కోర్టుకు వెళ్లిన ప్రధాన పూజారి.. అందరూ చూస్తుండగానే చనిపోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?

Person died afte went court against Daivasthana
Person died afte went court against Daivasthana

'దేవుడికి ఎదురెళ్లి చనిపోయాడు'.. ఇలాంటి మాటలు, సంఘటనలు సినిమాల్లోనే జరుగుతాయి. ఇటీవల వచ్చిన 'కాంతార' అనే చిత్రంలో కూడా ఇలాంటి సన్నివేశం ఒకటి ఉంది. ఇప్పుడు అచ్చం అలాంటి ఘటనే కర్ణాటకలో ఉడిపి జిల్లాలో జరిగింది. 500 ఏళ్ల ఆలయ విషయంలో కోర్టుకు వెళ్లిన వ్యక్తి ఆశ్చర్యకర రీతిలో మరణించాడు. ఈ ఘటన స్థానికులను భయపెడుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

పదుబిద్రి అనే గ్రామంలో పదుహిట్లు 'జరందయ దైవస్థాన' ఉంది. ఇక్కడ ఏడాదికోసారి 'నేమోత్సవ' వేడుకలు నిర్వహిస్తారు. అందులో గ్రామస్థులంతా చేరి పండుగ చేసుకుంటారు. ఈ ఆలయ నిర్వహణను 'జరందయ బంట సేవా సమితి' అనే కమిటీ చూసుకుంటుంది. ఈ కమిటీకి ప్రకాశ్​ శెట్టి అనే వ్యక్తి ఛైర్మన్​గా ఉండేవాడు. కొత్త కమిటీ ఏర్పడగానే ప్రకాశ్​ శెట్టి తన పదవిని కోల్పోయాడు. అంతవరకు పదవిలో ఉండి.. ఒక్కసారిగా అధికారం లేకపోయే సరికి తట్టుకోలేకపోయాడు ప్రకాశ్​ శెట్టి. దీంతో ఎలాగైనా అధికారం చెలాయించాలని.. ఐదుగురు వ్యక్తులతో మరో కమిటీ ఏర్పాటు చేశాడు. అనంతరం ఆ గుడికి 'ప్రధాన పూజారి(గురికారా)'ని నియమించాడు. 'దైవస్థాన'పై హక్కు తనకే ఉందని అధికారం చలాయించడానికి ప్రయత్నించాడు.

Person died afte went court against Daivasthana
దైవస్థాన

ప్రతి సంవత్సరం నిర్వహించే 'నేమోత్సవం'.. ఈసారి జనవరి 7న నిర్వహించి.. 'కోలం' వేయాలని జరందయ దైవస్థానం కమిటీ నిర్ణయించింది. ఈ నిర్ణయంపై ప్రకాశ్​ శెట్ట, అతడు నియమించిన ఆలయ ప్రధాన పూజారి కోర్టుకు వెళ్లారు. ఆ నేమోత్సవాన్ని ఎలాగైనా ఆపాలని డిసెంబర్​ 23న స్టే ఆర్డర్​ కూడా తెచ్చుకున్నారు. ఆశ్చర్యకరంగా అందరూ చూస్తుండగానే డిసెంబర్​ 24 అకస్మాత్తుగా కిందపడి చనిపోయాడు ఆలయ ప్రధాన పూజారి. కాగా, 'నేమోత్సవ' వేడుకలపై లాయర్​ బీ నాగరాజ్​ స్టే ఆర్డర్​ను ఎత్తి వేయించారు. ఇంత జరిగినా చలించని ప్రకాశ్​ శెట్టి.. కమిటీకి సంబంధించిన పలువురిపై బెదిరింపులకు తెగబడ్డాడు. ఆఖరికి దరంజయ దైవస్థాన దైవ నర్తకుడు భాస్కర బంగేరాని వేధింపులకు గురిచేశాడు. దేవుడు ఆవహించినప్పుడు తన మాటలను దేవుడు చెప్పినట్లుగా చెప్పాలని బెదిరించాడు ప్రకాశ్​ శెట్టి.

ఇదిలా ఉండగా, ఆలయ పూజారి మరణం కారణంగా జనవరి 7న జరగాల్సిన నేమోత్సవ వేడుకలను వాయిదా వేసింది దేవస్థాన కమిటీ. ఆ కమిటీ మాటలను లెక్కచేయకుండా.. ప్రకాశ్​ శెట్టి, అతడి అనుచరులు 'నేమోత్సవ' వేడుకలను నిర్వహించడానికి సిద్ధమయ్యారు. దీంతో ప్రకాశ్​ శెట్టి తీరుపై విసుగెత్తిపోయిన గ్రామస్థులు.. అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వారంతా సమావేశమై.. 500 ఏళ్ల చరిత్ర కలిగిన 'జరందయ బంట సేవా సమితి' కమిటీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపారు.

Person died afte went court against Daivasthana
సమావేశమైన గ్రామస్థులు

అచ్చం 'కాంతార' లానే..
ఇటీవల విడుదలైన కాంతార సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అందులో పంజుర్లి అనే దైవ ఉంటుంది. ఓ రాజు.. పంజుర్లి దైవ కోసం గ్రామస్థులకు భూమి దానం చేస్తాడు. కానీ తన మనవడు ఆ గ్రామానికి వచ్చి తన భూని.. తనకు అప్పగించాలని అడుగుతాడు. దీనికి పంజుర్లి దైవ ఒప్పుకోకపోవడం వల్ల.. కోర్టు కెళ్తాడు. అనంతరం ఆ కోర్టు మెట్లపైనే రక్తం కక్కుకుని చనిపోతాడు.

'దైవస్థాన' అంటే ఏమిటి ?
ఈ దైవస్థాన అనేది కర్ణాటక కోస్తా ప్రాంతంలో, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది. ఇక్కడ 'దైవ' అనే రూపాన్ని ప్రజలు ఆరాధిస్తారు. దేవుళ్లకు ఆలయాలు ఉన్నట్లుగా.. ఈ 'దైవ'లకు 'దైవస్థాన'ఉంటాయి. కానీ అవి గుళ్లలా కాకుండా ప్రత్యేక ఆకారంలో ఉంటాయి. ఇక్కడ జంతువులను కూడా బలిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.