ETV Bharat / bharat

తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే ఆంధ్రాలో రౌడీలను ఎదుర్కొంటున్నా : పవన్ కల్యాణ్

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 23, 2023, 2:22 PM IST

Updated : Nov 23, 2023, 2:32 PM IST

Pawan Kalyan Election Campaign in Kothagudem : కేంద్రంలో అలాగే రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఉంటేనే అభివృద్ధి సాధ్యమని జనసేన అధ్యక్షుడు పవన్​ కల్యాణ్ అన్నారు. తెలంగాణలో 19 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారన్న ఆయన.. కౌలు రైతులు రైతే కాదని కొంతమంది చేసిన వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని తెలిపారు. తెలంగాణ పోరాటస్ఫూర్తితోనే తాను ఏపీలో రౌడీలను, గూండాలను ఎదుర్కొంటున్నానని తెలిపారు.

Pawan Kalyan Election Campaign in Kothagudem
Pawan Kalyan

తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే ఆంధ్రాలో రౌడీలను ఎదుర్కొంటున్నా : పవన్ కల్యాణ్

Pawan Kalyan Election Campaign in Kothagudem : తెలంగాణలో ఉన్న పోరాట స్ఫూర్తి దేశమంతా ఉంటే అవినీతి ఎప్పుడో పారిపోయి ఉండేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. కొత్తగూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో ఏపీ సర్కార్​పై పోరాటం చేస్తున్నానని తెలిపారు. ఈ స్ఫూర్తితోనే తాను ఆంధ్రా రౌడీలను, గూండాలను ఎదుర్కొంటున్నానని చెప్పారు. తన ఇజం.. హ్యూమనిజమని పేర్కొన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పిన దాశరథి కృష్ణమాచార్యులు తనకు స్ఫూర్తి అని పవన్​ కల్యాణ్ చెప్పారు.

Pawan Kalyan at Kothagudem Public Meeting : తెలంగాణ రాష్ట్రం వస్తే అద్భుతాలు జరుగుతాయని అనుకున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణలో బీజేపీతో కలిసి ఎన్నికల బరిలో నిలిచామన్న పవన్.. ఆ పార్టీ పోటీ చేస్తున్న స్థానాల్లో జనసైనికులు మద్దతు ఇవ్వాలని సూచించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఏర్పడిందని పేర్కొన్నారు. వాటి కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు కష్టపడ్డాయని గుర్తు చేశారు. తెలంగాణ కోసం 1200 మంది బలిదానాల ఇచ్చారని విచారం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణలోనూ విస్తృతంగా పర్యటిస్తానని చెప్పారు.

వరంగల్​ పశ్చిమ నియోజకవర్గంలో నేడు పవన్​ కల్యాణ్​ ఎన్నికల ప్రచారం - ఏం మాట్లాడతారా అని సర్వత్రా ఆసక్తి!

Pawan Kalyan on Young Voters : అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్న యువతకు జనసేన అండగా నిలబడుతుందని పవన్​ హామీ ఇచ్చారు. మోదీ ప్రధాని కాక ముందే మద్దతు తెలిపానని గుర్తు చేశారు. తనకు కేసీఆర్‌, కేటీఆర్‌, రేవంత్‌ రెడ్డి, వీహెచ్‌తో పరిచయాలు ఉన్నాయన్నారు. అన్ని పార్టీల నాయకులతో పరిచయం ఉన్నప్పటికీ మోదీ, బీజేపీకి తన మద్దతు ఇచ్చినట్లు పేర్కొన్నారు. స్నేహం వేరు.. రాజకీయాలు వేరని స్పష్టం చేశారు.

"తెలంగాణలో బీసీని సీఎం చేయగలిగేది మోదీ నేతృత్వంలోని బీజేపీ మాత్రమే. 50 శాతం ప్రజల ఉన్న రాష్ట్రంలో కచ్చితంగా బీసీనే సీఎం అవ్వాలి. తెలంగాణలో 32 మంది జనసైనికులు పోటీలో ఉండాలని నిర్ణయించుకున్నారు. కానీ, బీసీ ఎజెండాతో వస్తున్న బీజేపీ కోసం త్యాగం చేయాలని వారికి నేను చెప్పాను. నా మాట విని 26 మంది పోటీ చేయాలన్న ఆలోచన విరమించుకున్నారు." - పవన్ కల్యాణ్, జనసేన అధినేత

Telangana Assembly Elections 2023 : కేంద్రం, రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఉంటేనే అభివృద్ధి సాధ్యమని పవన్​ కల్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలో 19 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారన్న ఆయన.. కౌలు రైతులు రైతే కాదని చేసిన వ్యాఖ్యలు తనకు బాధకలిగిందన్నారు. కౌలు రైతులపై చూలకనగా మాట్లడకూడదని కోరారు. ధరణి విఫలమైందని ప్రభుత్వం కూడా ఒప్పుకుంటుందని ఆరోపించారు.

తెలంగాణ, ఏపీలో ఎన్నికలు ఐదు ఏళ్లుకు ఒకేసారి జరగాలని సూచించారు. రెండు రాష్ట్రాల్లోనూ ప్రతి సంవత్సరం ఎన్నికల లాగానే పరిస్థితులు ఉన్నాయని వెల్లడించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్న పవన్.. మోదీ నాయకత్వంలోనే ఉపాధి అవకాశాలు వస్తాయని బలంగా విశ్వసిస్తున్నాని తెలిపారు. మోదీ మూడోసారి ప్రధాని కావాలన్నదే తన ఆకాంక్ష అని స్పష్టం చేశారు. తెలంగాణ, దేశంలోనూ బీజేపీ సర్కార్‌ రావాలని పవన్​ కల్యాణ్ ఆకాంక్షించారు.

'బీసీ ముఖ్యమంత్రిని చూడాలంటే జనసేన-బీజేపీ అభ్యర్థులను గెలిపించండి'

Last Updated : Nov 23, 2023, 2:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.