ETV Bharat / bharat

తమిళనాడులో భారీ ఆపరేషన్​.. రూ. 23కోట్ల విలువైన హెరాయిన్​ సీజ్​

author img

By

Published : Dec 27, 2021, 8:21 AM IST

Operation cannabis hunting: పోలీసులు చేపట్టిన ఆపరేషన్​లో తమిళనాడు వ్యాప్తంగా భారీ ఎత్తున మాదకద్రవ్యాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో రూ. 23కోట్లు విలువగల హెరాయిన్​, రూ. 4.2కోట్లు విలువ చేసే కుట్కా, రూ. 18కోట్లు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Operation cannabis hunting
తమిళనాడులో భారీ ఆపరేషన్​.. రూ. 23కోట్లు విలువైన హెరాయిన్​ సీజ్​

Operation cannabis hunting: మాదకద్రవ్యాలపై.. తమిళనాడువ్యాప్తంగా గత 20 రోజులుగా భారీ స్థాయిలో ఆపరేషన్​ జరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు రూ. 23కోట్లు విలువగల హెరాయిన్​, రూ. 4.2కోట్లు విలువ చేసే కుట్కా, రూ. 18కోట్లు విలువ చేసే గంజాయిని అధికారులు జప్తు చేశారు. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు 6,623మందిని అదుపులోకి తీసుకున్నారు.

రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా.. తూత్తుకుడిలో 23కేజీల హెరాయిన్​ బయటపడింది. ఇందులో భాగంగా పోలీసులు ఏడుగురిని అరెస్ట్​ చేశారు. మరోవైపు గంజాయి అక్రమ రవాణా విషయంలో.. మూడు వారాల్లో ఏకంగా 816 కేసులు నమోదయ్యాయి. 871మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ. 1.88కోట్ల గంజాయిని పట్టుకున్నారు.

Operation cannabis hunting
నిందితుల వివరాలు

ఈ ఆపరేషన్​లో భాగంగా.. 40 టన్నుల కుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 5,457 కేసులు వేసి 5,037 మందిని అరెస్ట్​ చేశారు.

డ్రగ్స్​ను పట్టుకునే విషయంలో ప్రజలు కూడా సహకరించాలని పోలీసులు పిలుపునిచ్చారు. డ్రగ్​ డీలర్ల సమాచారం తెలిస్తే వాట్సాప్​ ద్వారా తమకు చెప్పాలని సూచించారు.

ఇదీ చూడండి:- యువ నటి ఆత్మహత్య.. డ్రగ్స్ కేసు భయంతో...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.