ETV Bharat / bharat

తుపాకులతో బెదిరించి 8 నిమిషాల్లో రూ.1.25కోట్లు స్వాహా!

author img

By

Published : Oct 28, 2021, 10:56 PM IST

మహారాష్ట్రలో సినీఫక్కీలో జరిగిన ఓ దొంగతనం కలకలం సృష్టించింది. ముఖానికి మాస్కులతో బ్యాంకులోకి వచ్చిన దుండగులు కోటికి పైగా నగదు, నగలు దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాపు చేపట్టారు.

bank robbery
దొంగతనం

మహారాష్ట్ర జల్నా జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు (Bank Robbery in India). అంబాద్‌ తాలూకా షాఘడ్‌లోని బుల్దానా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్‌లోకి గురువారం సాయంత్రం సాయుధులైన దొంగలు ప్రవేశించారు. అక్కడి సిబ్బందిని తుపాకులతో బెదిరించి సుమారు రూ.1.25 కోట్ల విలువైన నగలు, నగదు దోచుకెళ్లారు.

"సాయంత్రం 5 గంటల సమయంలో ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు బ్రాంచ్‌లోకి ప్రవేశించారు. తుపాకులు చూపిస్తూ సిబ్బందిని బెదిరించారు. మా అందరి ఫోన్లను లాక్కుని స్ట్రాంగ్‌రూమ్‌లో పడేసి తాళం వేశారు. రూ.25 లక్షల నగదు, కోటి రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో ఉడాయించారు."

--బ్యాంకు సిబ్బంది

ఈ బ్రాంచ్​లో సెక్యూరిటీ గార్డు లేడని.. కేవలం ఎనిమిది నిమిషాల్లో దుండగులు ఈ దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. దొంగలను పట్టుకునేందుకు జల్నా, బీడ్, ఔరంగాబాద్ జిల్లాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.

జిల్లా ఎస్పీ వినాయక్ దేశ్‌ముఖ్, అదనపు ఎస్పీ విక్రాంత్ దేశ్‌ముఖ్, స్థానిక క్రైమ్ బ్రాంచ్ చీఫ్ సుభాష్ భుజంగ్​లు ఘటనా స్థలాన్ని సందర్శించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.