ETV Bharat / bharat

New Liquor Policy in AP: మద్య నిషేధమని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్​.. ఆ హామీని మరిచి..!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 30, 2023, 10:24 AM IST

New Liquor Policy in AP: అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి మద్య నిషేదం అంటూ ఉకదంపుడు హామీల గురించి మాట్లాడి.. ప్రస్తుతం ఆ హామీలను పట్టించుకున్న పరిస్థితే లేదు. మద్యం నిషేదం అంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని.. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మద్యం విధానంతో విస్మరించారని నిరూపితమయ్యింది.

New_Liquor_Policy_in_AP
New_Liquor_Policy_in_AP

New Liquor Policy in AP: మద్య నిషేధమని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్​.. ఆ హామీని మరిచి నూతన మద్య విధానం..

New Liquor Policy in AP: మద్యం కాపురాల్లో చిచ్చుపెడుతోందని గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చారు. పేద, మధ్యతరగతి కుటుంబాల్ని పీల్చేస్తోందని ఊరూరా చెప్పారు. అధికారంలోకి రాగానే దశలవారీ మద్య నిషేధాన్ని అమలు చేస్తానని హోరెత్తించారు. మద్యాన్ని ఫైవ్‌స్టార్‌ హోటళ్లకు పరిమితం చేశాకే 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని సెలవిచ్చారు.

ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా ప్రస్తుతమున్న మద్యం దుకాణాల సంఖ్యను ఒక్కటీ తగ్గించకుండా.. నూతన మద్యం విధానాన్ని తీసుకువచ్చారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ హయాం ముగిసేవరకూ మద్యం దుకాణాలు కొనసాగిస్తామని నూతన మద్యం విధానంలో తేల్చిచెప్పారు. విలువలు, విశ్వసనీయత అంటూ గొప్పలు చెప్పే జగన్‌ సారు.. 2024 ఎన్నికల్లో ఓట్లు అడగకుండా మాటమీద నిలబడతారా? లేక యథావిధిగా నాలుక మడతేస్తారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

"మన ప్రభుత్వంలో మద్యాన్ని పూర్తిగా నిషేదిస్తామని గట్టిగా చెప్తున్నా. తాగాలనుకుంటే 5స్టార్​ హోట్లల్లో తాగినా పర్వాలేదు కానీ.. మిగిలిన చోట్ల మద్యాన్ని పూర్తిగా లేకుండా చేస్తామని కూడా గట్టిగా చెప్తున్నా. చంద్రబాబుకు కూడా గట్టిగా చెప్తున్నాం. చంద్రాబాబు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. మొట్టమొదటి అవకాశం చంద్రబాబుకే ఇస్తున్నాం. ఆయన్నే నిషేదం చేయామని చెప్తున్నాం." అని ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలివి. జడలు విప్పిన మద్య భూతం బెల్టు తీస్తాడంట. ఇవి అన్న బైబుల్‌, ఖురాన్‌, భగవత్‌గీతగా భావించే మేనిఫెస్టోలో చెప్పిన మాటలు.

మద్య నిషేదం, నిషేదం అంటూనే.. 3 పెగ్గులు, 6 గ్లాసులుగా బెల్టు షాపులు

గతంలో తాను చెప్పిన ఈ మాటలకు సీఎం జగన్‌ కట్టుబడితే.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల్ని ఓట్లు అడగకూడదు. ఆ అర్హత ఆయన కోల్పోయారు. ఆ నైతిక హక్కు పోగొట్టుకున్నారు. ఎందుకంటే ఆయన హామీ ఇచ్చినట్లుగా 2024 ఎన్నికల నాటికి మద్యాన్ని ఐదు నక్షత్రాల హోటళ్లకు పరిమితం చేయట్లేదు. ఇక ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగటానికి వెళ్తారు? సీపీఎస్, రాజధాని అమరావతి మొదలుకుని కీలకమైన ప్రతి హామీ విషయంలోనూ మాట తప్పటం, మడమ తిప్పటం అలవాటుగా చేసుకున్న జగన్‌.. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అత్యంత ప్రధానమైన హామీల్లో ఒకటైన దశలవారీ మద్య నిషేధం హామీకి మంగళం పాడేశారు. శుక్రవారం విడుదల చేసిన నూతన మద్యం విధానమే అందుకు నిదర్శనం.

రాష్ట్రంలో ప్రస్తుతమున్న 2,934 మద్యం దుకాణాల సంఖ్యను ఒక్కటీ తగ్గించకుండా 2024 సెప్టెంబరు 30 వరకూ యథాతథంగా కొనసాగించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు 2023-24 సంవత్సరానికి సంబంధించిన కొత్త మద్యం విధానాన్ని శుక్రవారం ఖరారు చేసింది. అక్టోబరు 1 నుంచి ఏడాది పాటు ఈ విధానం అమల్లో ఉండనుందని ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ ఉత్తర్వులిచ్చారు.

మద్య నిషేధమంటూ అధికారంలోకొచ్చి.. రూ. 6వేల కోట్లు కొల్లగొట్టారు

ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ పదవీకాలం 2024 మే వరకే ఉంది. కానీ తాజాగా ప్రకటించిన మద్యం విధానం కాలపరిమితి 2024 సెప్టెంబరు నెలాఖరు వరకూ ఉంది. అంటే ఈ ప్రభుత్వ హయాం ముగిసే నాటికి రాష్ట్రంలోని మద్యం దుకాణాలన్నింటినీ ఆపేసి.. అయిదు నక్షత్రాల హోటళ్లకు మద్యం పరిమితం చేయట్లేదనే విషయాన్ని జగన్‌ ప్రభుత్వం తేల్చేసింది. అంటే మద్య నిషేధం హామీకి జగన్‌మోహన్‌ రెడ్డి నీళ్లొదిలేసినట్లేనని తేటతెల్లమైపోయింది.

దశలవారీ మద్యనిషేధం కోసం ఏటా దుకాణాల సంఖ్యను క్రమంగా తగ్గించుకుంటూ వెళ్తామని చెప్పిన జగన్‌ ప్రభుత్వం.. 2020 మార్చి 22 నుంచి ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క మద్యం దుకాణాన్ని కూడా తగ్గించలేదు. తాజా విధానం ప్రకారం మరో ఏడాదిపాటు కూడా ఇప్పుడున్న దుకాణాల సంఖ్య తగ్గదు. మద్యం దుకాణాల సంఖ్యను 2019 అక్టోబరులో 3,500కు, 2020 మార్చిలో 2,934కు వైసీపీ ప్రభుత్వం తగ్గించింది. 2020-21, 2021-22, 2022-23 సంవత్సరాలతో పాటు తాజాగా ప్రకటించిన 2023-24కి సంబంధించిన మద్యం విధానాల్లో దుకాణాల తగ్గింపు ఊసే లేదు. మద్య నిషేధంపై చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే తాజాగా ఖరారు చేసిన విధానంలోనే దుకాణాలన్నీ నిలిపేయాలి. కానీ జగన్‌ ప్రభుత్వం అలా చేయలేదు.

Pawan Kalyan: సంపూర్ణంగా మద్యం మీదే ప్రభుత్వ ఆదాయం: పవన్ కల్యాణ్

ప్రస్తుతమున్న మద్యం దుకాణాల సంఖ్యే యథాతథంగా కొనసాగుతుందని ఓ వైపు చెబుతున్న ప్రభుత్వం.. మరోవైపు పర్యాటక కేంద్రాల్లో లిక్కర్‌ అవుట్‌లెట్లు, వాకిన్‌ షాప్‌ల ఏర్పాటుకు తాజా విధానంలో కూడా అనుమతిచ్చింది. అంటే అదనంగా మరిన్ని మద్యం దుకాణాలు ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. బెవరేజస్‌ కార్పొరేషన్‌ అనుమతితో ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. మద్య నిషేధమే ప్రభుత్వ లక్ష్యమైతే మరి వీటి ఏర్పాటుకు ఎందుకు అనుమతిస్తున్నట్లో ప్రభుత్వమే జవాబు చెప్పాలి.

మద్యం వాకిన్‌ షాప్‌ల పేరిట మద్యాన్ని మరింత అందుబాటులోకి తీసుకొస్తోంది. అంతకు ముందులాగే ఈ ఏడాది కూడా ఎలైట్‌ షాపులు పెట్టుకోవటానికి అనుమతిచ్చింది. అయితే వీటితో కలిపినా మొత్తం దుకాణాల సంఖ్య 2,934కు మించకూడదని పేర్కొంది. మరింత ఆదాయం రాబట్టుకోవటమే లక్ష్యంగా ఈ వాకిన్‌ షాప్‌లకు మళ్లీ అనుమతిచ్చింది. రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో హోలోగ్రామ్‌లతో కూడిన ట్రాక్‌ అండ్‌ ట్రేస్‌ విధానం అమలవుతుందని, అన్ని దుకాణాల్లోనూ డిజిటల్‌ పేమెంట్ల విధానాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం కొత్త మద్య విధానంలో పేర్కొంది.

మద్యం అమ్మకుండా ప్రభుత్వం నడవలేదా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.