ETV Bharat / bharat

India Covid cases: దేశంలో కొత్తగా 7వేల కరోనా కేసులు

author img

By

Published : Dec 19, 2021, 9:32 AM IST

INDIA COVID CASES
INDIA COVID CASES

దేశంలో మరో 7,081 కరోనా కేసులు నమోదయ్యాయి. 264 మంది మరణించారు. శనివారం 76,54,466 మందికి టీకాలు అందించారు.

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా నమోదవుతోంది. 24 గంటల వ్యవధిలో 7,081 కేసులు నమోదయ్యాయి. మరో 264 మంది ప్రాణాలు కోల్పోయారు. 7,469మంది కోలుకున్నారు.

మొత్తం కేసులు: 3,47,40,275‬

మొత్తం మరణాలు: 4,77,422

యాక్టివ్ కేసులు: 83,913

కోలుకున్నవారు: 3,41,78,940

Vaccination in India

దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. శనివారం మరో 76,54,466 మందికి వ్యాక్సిన్లు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,37,46,13,252కు చేరింది.

Covid world cases

అటు, ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఆందోళనకర రీతిలో నమోదవుతున్నాయి. ఒక్కరోజే 5,57,866 కేసులు వెలుగులోకి వచ్చాయి. 5,156 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • బ్రిటన్​లో వైరస్ విజృంభిస్తోంది. తాజాగా 90 వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. 125 మంది మరణించారు. 13 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
  • అమెరికాాలో కరోనా వ్యాప్తి తీవ్రంగానే ఉంది. కొత్తగా 85 వేల కేసులు వెలుగుచూశాయి. 487 మంది వైరస్​కు బలయ్యారు. మొత్తం మరణాల సంఖ్య 8 లక్షల 27 వేలు దాటింది.
  • ఫ్రాన్స్​లో 58 వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 85 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 85 లక్షల 77 వేలకు చేరుకుంది.
  • రష్యాలో కరోనా మరణాల సంఖ్య భారీగానే నమోదవుతోంది. మరో 1,076 మంది కొవిడ్​తో ప్రాణాలు విడిచారు. ఆ దేశంలో 27 వేల కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి.

ఇదీ చదవండి: Uk Lockdown: బ్రిటన్​లో రెండు వారాలపాటు లాక్​డౌన్​?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.