ETV Bharat / bharat

భార్యను కాటేసిన పాము.. డాక్టర్లకు క్లారిటీ కోసం భర్త ఏం చేశాడంటే?

author img

By

Published : Jun 25, 2022, 10:22 AM IST

Updated : Jun 25, 2022, 10:54 PM IST

ఇంట్లో పనులు చేస్తుండగా ఓ మహిళ పాము కాటుకు గురైంది. వెంటనే వచ్చిన ఆమె భర్త.. ఆ పామును ఓ బాటిల్​లో బంధించాడు. అంతే కాకుండా బాధితురాలితో పాటు ఆసుపత్రికి కూడా తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు 'పాము ఎందుకు తెచ్చావ్?​' అని అడిగిన ప్రశ్నకు అతడు ఇచ్చిన సమాధానం విని ఒక్కసారిగా షాకయ్యారు. అసలేం జరిగిందంటే?

in unnao the wife was bitten by a snake
in unnao the wife was bitten by a snake

ఉత్తర్​ప్రదేశ్​​లో ఓ వ్యక్తి చేసిన పనికి ఒక్కసారిగా వైద్యులు షాకయ్యారు. ఉన్నావ్​ జిల్లాకు చెందిన ఓ మహిళను పాము కాటేసింది. వెంటనే బిగ్గరగా ఆమె కేకలు పెట్టింది. అక్కడే ఉన్న ఆమె భర్త ఆ పామును ఓ బాటిల్​లో బంధించి.. బాధితురాలితో పాటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. 'పామును ఎందుకు తీసుకొచ్చావ్​?' అని వైద్యులు అడిగితే అదిరిపోయే సమాధానం ఇచ్చాడు.

ఇదీ జరిగింది.. ఉన్నావ్‌లోని రౌ అఫ్జల్ నగర్‌లో నివాసం ఉంటున్న రామేంద్ర యాదవ్ భార్య గురువారం రాత్రి ఇంటిలో పనులు చేసుకుంటుంది. ఆ సమయంలో హఠాత్తుగా ఆమెను ఓ పాము కాటు వేసింది. భార్య కేకలు విని అక్కడకు వచ్చిన భర్త.. ఆ పాము పట్టుకునన్నాడు. దానిని ఓ బాటిల్​లో బంధించాడు. సీసాలోని పాము చావకుండా గాలి లోపలికి వెళ్లేలా రంధ్రాలు చేశాడు.

in unnao the wife was bitten by a snake
బాటిల్​లో పాము

ఆ తర్వాత భార్యతో పాటు ఆ బాటిల్​ను తీసుకుని జిల్లా ఆసుపత్రికి వెళ్లాడు రామేంద్ర. వైద్యులు వెంటనే ఆమెకు చికిత్స ప్రారంభించారు. అయితే బాటిల్​లో పామును చూసి వైద్యులు షాకయ్యి 'ఎందుకు తీసుకొచ్చావు?' అని అడిగారు. అందుకు రామేంద్ర.. 'ప్రతిసారి పాము కాటు వేసినప్పుడు.. ఏ పాము అని అడుగుతారు అందుకే ఈ సారి పామును పట్టుకుని మరీ తీసుకొచ్చాను' అని చెప్పాడు. అనంతరం ఆ పామును అడవిలో వదిలేశాడు. బాధితురాలి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని.. ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు వైద్యులు తెలిపారు.

ఇవీ చదవండి: భూమి-భుక్తి కోసం బ్రిటిష్​ సైన్యాన్నే ఢీకొట్టారు

భార్యకు ప్రేమతో.. చంద్రుడిపై స్థలాన్ని కానుకగా ఇచ్చిన భర్త

Last Updated :Jun 25, 2022, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.