'లవ్​ జిహాద్​' కేసులో దోషికి 10ఏళ్ల జైలు, రూ.30వేలు ఫైన్​

author img

By

Published : Dec 22, 2021, 5:52 PM IST

Uttar Pradesh love jihad case

Uttar Pradesh love jihad case: ఉత్తర్​ప్రదేశ్​లోని కాన్పుర్​ జిల్లా కోర్టు లవ్​ జిహాద్​ కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.30వేల జరిమానా విధించింది. బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దోషిగా తేల్చుతూ శిక్ష ఖరారు చేసింది.

Uttar Pradesh love jihad case: లవ్​ జిహాద్​ కేసులో తొలిసారి విచారణ చేపట్టిన ఉత్తర్​ప్రదేశ్​లోని కాన్పుర్​ జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రేమ పేరుతో బలవంతంగా మత మార్పిడికి పాల్పడేందుకు యత్నించిన వ్యక్తికి 10ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.30వేల జరిమానా విధించింది.

కాన్పుర్​లోని జుహిపుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కచ్చి బస్తీ ప్రాంతానికి చెందిన జావెద్​ అనే వ్యక్తి.. 2017, మే 15న మైనర్​ బాలికతో.. తనను హిందువుగా పరిచయం చేసుకున్నాడు. తన పేరును మున్నాగా చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత బాలికను తనతో తీసుకెళ్లాడు.

ఆ తర్వాత బాధితురాలి కుటుంబ సభ్యులు జుహిపుర్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో, అత్యాచారం నేరాల కింద కేసులు నమోదు చేశారు. ఫిర్యాదు అందిన మరుసటి రోజునే బాలికను రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడిని జైలుకు పంపారు.

సీఆర్​పీసీ సెక్షన్​ 164 ప్రకారం బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశారు పోలీసులు. పెళ్లి చేసుకుంటానని చెప్పి జావెద్​ తీసుకెళ్లినట్లు చెప్పింది బాలిక. అతని ఇంటికి వెళ్లాకే.. మతం గురించి చెప్పాడని, పెళ్లి చేసుకోవాలని కోరగా.. తిరస్కరించినట్లు వెల్లడించింది. తనను బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించినట్లు పేర్కొంది.

బాధితురాలి వాంగ్మూలం మేరకు జిల్లా అదనపు జడ్జి.. జావెద్​కు 10 ఏళ్ల జైలు శిక్ష విధించారు.

త్వరగా తీర్పు వచ్చేందుకు కృషి చేసిన యోగి ఆదిత్యనాథ్​ ప్రభుత్వానికి, కోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు బాధిత కుటుంబ సభ్యులు.

ఇదీ చూడండి:

సోషల్ మీడియాకు భయపడి పెళ్లి రద్దు!

'లవ్​ జిహాద్​' బిల్లుకు గుజరాత్ అసెంబ్లీ ఆమోదం​

నిఖితా తోమర్​ హత్య కేసు దోషులకు జీవితఖైదు

యూపీలో 'లవ్​ జిహాద్​' మొదటి అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.