ETV Bharat / bharat

కొత్త ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్.. మోదీతో భేటీ కావాల్సి ఉండగా..

author img

By

Published : Dec 19, 2022, 11:04 AM IST

Updated : Dec 19, 2022, 11:46 AM IST

హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు కరోనా బారిన పడ్డారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆయనకు కొవిడ్ నిర్ధరణ అయ్యింది.

Sukhvinder Singh sukku
సుఖ్విందర్ సింగ్ సుఖు

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం దిల్లీ పర్యటనలో ఉన్న ఆయనకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. సోమవారం హిమాచల్ సీఎం సుఖు.. ప్రధాని మోదీతో భేటీ కావాల్సి ఉండగా ఈ క్రమంలో ఆయనకు కొవిడ్ సోకింది. అంతకుముందు రాజస్థాన్​లో జరుగుతున్న రాహుల్ ​గాంధీ భారత్​ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుఖుతో పాటు హిమాచల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు.

ప్రధాని మోదీని కలిసిన అనంతరం సోమవారం సాయంత్రం సుఖ్విందర్​ సింగ్​.. శిమ్లా చేరుకోవాల్సి ఉండగా ఈ క్రమంలోనే ఆయనకు కరోనా సోకిందని రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. కొన్ని రోజులపాటు సుఖు దిల్లీలోనే ఉండనున్నట్లు పేర్కొన్నారు. సీఎంకు స్వల్పంగా కొవిడ్ లక్షణాలు ఉన్నాయని.. ప్రస్తుతం క్వారంటైన్​లో ఉన్నారని ఆయన వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్​లో శాసనసభ శీతాకాల సమావేశాలు డిసెంబరు 22 నుంచి జరగనున్న నేపథ్యంలో సీఎం మహమ్మారి బారిన పడడం గమనార్హం.

ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 68 స్థానాలకుగాను 40 సీట్లు గెలుచుకుంది. భాజపా 25 సీట్లకు పరిమితమైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్ఠానం సుఖ్విందర్​ సింగ్ సుఖును హిమాచల్​ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది.

Last Updated :Dec 19, 2022, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.