ETV Bharat / bharat

ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం: మంత్రి బొత్స సత్యనారాయణ

author img

By

Published : Apr 1, 2023, 2:14 PM IST

Updated : Apr 1, 2023, 2:33 PM IST

AP Education Minister Botsa Satyanarayana comments: ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్‌ 3వ (సోమవారం) తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభంకానున్నాయని.. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై స్పందించారు. మరోసారి మూడు రాజధానుల అంశంపై, ముందస్తు ఎన్నికలపై, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్య కుమార్‌ దాడి ఘటనపై బొత్స సత్యనారాయణ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

AP Education
AP Education

AP Education Minister Botsa Satyanarayana comments: ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్‌ 3వ (సోమవారం) తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభంకానున్నాయని.. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..''ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయి. ఈ ఏడాది నుంచి 6 పేపర్ల విధానంలో పరీక్షలు జరుగుతాయి. పరీక్షలు జరిగే 3,349 పాఠశాలల్లో రెండుపూటలా సెలవులను ప్రకటిస్తున్నాం. ప్రత్యేక కారణం ఉంటే తప్ప నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్‌లోకి అనుమతించం. హాల్ టికెట్ ఆధారంగా విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాము. గతంలో లీకేజీ ఆరోపణలు వచ్చిన టీచర్లపై సర్క్యులర్ వెనక్కి తీసుకున్నాం. తహశీల్దార్‌ కార్యాలయాల్లో ఉంచాలన్న సర్క్యులర్‌ను కూకడా వెనక్కి తీసుకున్నాం. ఉపాధ్యాయులపై ప్రభుత్వానికి ఎలాంటి కోపం లేదు.'' అని ఆయన అన్నారు.

మూడు రాజధానులపై మరోసారి స్పష్టత: అనంతరం మూడు రాజధానులు అనే అంశం వైసీపీ పార్టీ, ప్రభుత్వ విధానమని.. మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని తీసుకొచ్చి అమరావతి గోతుల్లో పోయాలా? అని నిలదీశారు. మూడు రాజధానుల విధానంతోనే వచ్చే ఎన్నికలకు వెళతామని ఆయన తేల్చి చెప్పారు. న్యాయ చిక్కులు, ఇతరత్రా సాంకేతిక సమస్యలు లేకుంటే.. రేపటి నుంచే విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించాలని అనుకుంటున్నామని బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు.

పట్టభద్రుల ఎన్నికల్లో తప్పెక్కడ జరిగిందో సమీక్షిస్తాం: ఊరంటే స్మశానమూ ఉంటుందని.. ఆ ఉద్దేశంతోనే అమరావతిని గతంలో స్మశానం అన్నానని ఆయన వివరించారు. నివాసయోగ్య ప్రాంతమూ ఉంది కాబట్టే ఇప్పుడు అక్కడ ఇళ్ల స్థలాలను ఇస్తున్నామన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు అనేవి సహజమన్న ఆయన... పట్టభద్రుల ఎన్నికల్లో తప్పెక్కడ జరిగిందో సమీక్షించుకుంటామన్నారు. ఉత్తరాంధ్రలో తమ అభ్యర్థి ఓటమి తన వైఫల్యంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. విశాఖ రాజధాని సెంటిమెంట్‌ను ప్రజలు నమ్మలేదనే వాదనతో ఏకీభవించనని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

ఎన్నికలు వస్తే త్వరగా తమ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చనే భావనలో చంద్రబాబు: ఐదు ఏళ్లపాటు ప్రజలు పాలించమని ఇచ్చిన ఈ అవకాశాన్ని వదులుకొని.. ఎందుకు ముందస్తుకు వెళ్తాం అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికలు కావాల్సింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకేనని, ఎన్నికలు వస్తే త్వరగా తమ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చనే భావనలో ఆయన ఉన్నారని విమర్శించారు.

సత్య కుమార్‌పై జరిగిన దాడి సందర్భం ప్రకారం జరిగిందే: ఇక, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్య కుమార్‌పై జరిగిన దాడిపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. సత్య కుమార్‌పై జరిగిన దాడి సందర్భం ప్రకారం జరిగిందే తప్ప.. తాము ఎందుకు చేయిస్తామని ఆయన ప్రశ్నించారు. రైతులు టెంట్ వేసుకుని కూర్చోవడం ఉద్యమ స్పూర్తా..? అని ప్రశ్నించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో దోపిడీ జరిగిందని ఎప్పటినుంచో చెప్తున్న మాటలకు తాను కట్టుబడి ఉన్నానని.. మంత్రి బొత్స స్పష్టం చేశారు. రాజధాని పేరుతో ఆర్ధికంగా లబ్ధిపొందిన వారు తప్ప నిజమైన రైతులెవ్వరూ ఉద్యమంలో లేరని ఆయన దుయ్యబట్టారు.

ఇవీ చదవండి

Last Updated :Apr 1, 2023, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.