ETV Bharat / bharat

దారుణ హత్య.. ఒక్కోచోట ఒక్కో శరీరభాగం.. అసలేమైంది?

author img

By

Published : Jul 23, 2022, 5:58 PM IST

Body parts found in ahmedabad: గుజరాత్​లోని అహ్మదాబాద్​లో దారుణం జరిగింది. గత కొద్ది రోజులుగా నగరంలోని ఒక్కో చోట ఒక్కో శరీర భాగం పోలీసుల కంట పడుతోంది. ఇటీవల ఓ మొండాన్ని గుర్తించగా.. శుక్రవారం మరో ప్రాంతంలో రెండు కాళ్లను గుర్తించారు.

gujaratgujarat ahmedabad news
హత్య కలకలం

Body parts found in ahmedabad: గుజరాత్​ అహ్మదాబాద్​లో వివిధ ప్రాంతాల్లో శరీర భాగాలు లభ్యమవుతుండటం స్థానికంగా కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం నగరంలోని వసానా ప్రాంతంలోని సూరయ్​నగర్​లో హత్యకు గురైన ఓ వ్యక్తి మొండాన్ని గుర్తించారు పోలీసులు. కాళ్లు, చేతులు, తల లేని మొండెం బయటపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్న పోలీసులకు శుక్రవారం ఆ శరీరానికి సంబంధించిన మరో రెండు భాగాలు లభ్యమయ్యయి. ఎల్లిస్​బ్రిడ్జ్​ ప్రాంతంలో కాల్గీ క్రాస్​ రోడ్​ ప్రాంతంలో రెండు కాళ్లను గుర్తించారు పోలీసులు. సినిమా తరహాలో ఉన్న ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతుడిని, హంతకుడిని వీలైనంత త్వరగా గుర్తించేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు.

వసానా, ఎల్లీస్​బ్రిడ్జ్​ ప్రాంతాల్లో లభ్యమైన శరీర భాగాలను డీఎన్​ఏ పరీక్షల కోసం తరలించారు పోలీసులు. రెండు ప్రాంతాల్లోనూ దొరికిన శరీర భాగాలు ఒకరివే అని తేలడం సహా మృతిచెందిన వ్యక్తి ఎవరో తెలిస్తే దర్యాప్తు వేగవంతం అవుతుందన్నారు పోలీసులు. నిందితుడి త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : రోడ్డుపై భారీ ట్రక్కును అడ్డుకొని.. ఏనుగు ఏం చేసిందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.