ETV Bharat / bharat

పిల్లి విషయంలో గొడవ.. కుమారుడిని చంపిన తండ్రి.. యువకుడిని మింగేసిన మొసలి

author img

By

Published : Oct 29, 2022, 10:19 AM IST

భోజన సమయంలో వచ్చిన పిల్లిని బయటకు పంపలేదని కుమారుడినే హతమార్చాడు ఓ తండ్రి. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో వెలుగుచూసింది. మరోవైపు, నదిలో స్నానానికి దిగిన యువకుడిని మొసలి మింగేసిన ఘటన బిహార్​లో జరిగింది.

father killed son
కుమారుడి హత్య

మధ్యప్రదేశ్​ నర్సింగపుర్​లో దారుణం జరిగింది. కన్న కుమారుడిని హతమార్చాడు ఓ తండ్రి. గోట్​గావ్ పోలీస్ పరిధిలో నివసిస్తున్న కేదార్​ పటేల్​.. ఇంట్లో భోజనం చేస్తుండగా అతడి ముందు పిల్లి వచ్చి ఆగింది. పిల్లిని కొట్టి బయటకు పంపాలని కేదార్ పటేల్​ తన కుమారుడు అభిషేక్ పటేల్​ను కోరాడు. తండ్రి మాటను అభిషేక్ పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన కేదార్​.. మొదట పిల్లిని పట్టుకుని చంపేశాడు. అనంతరం కుమారుడిపై కూడా పదునైన ఆయుధంతో మెడపై దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడు కేదార్​ను అరెస్ట్ చేశారు. అభిషేక్​ మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

యువకుడిని మింగిన మొసలి..
బిహార్​ ముజఫర్​నగర్​లోని భవానీపుర్​లో దారుణం జరిగింది. ఛఠ్​ పూజ సందర్భంగా భాగ్​మతి నదిలో స్నానానికి వెళ్లిన యువకుడిని మొసలి మింగేసింది. మృతుడిని శ్రవణ్‌ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. మొసలి యువకుడిని మింగేస్తున్న సమయంలో పలువురు భక్తులు అక్కడే ఉన్నా.. ఎవరూ భయంతో యువకుడిని రక్షించేందుకు వెళ్లలేదు. గత కొన్ని రోజులుగా నది ఒడ్డున మొసళ్లు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అంతకుముందు కూడా ఓ మత్స్యకారుడిపై మొసళ్లు దాడి చేశాయని అయితే అతడు ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘాట్​కు చేరుకున్నారు. ఎన్​డీఆర్​ఎఫ్ బలగాల సహాయంతో యువకుడి కోసం వెతుకులాట ప్రారంభించారు.

వాచ్​మెన్ హత్య..
బిహార్‌లోని మాధేపురాలో దారుణం జరిగింది. నేరస్థుడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన వాచ్​మన్​ను దుండగులు కాల్చి చంపారు. ఓ విగ్రహం నిమజ్జన కార్యక్రమంలో వాచ్‌మెన్​ గురుదేవ్ పాశ్వాన్, అరబింద్ పాశ్వాన్​ పాల్గొన్నారు. ఈ క్రమంలనే.. నేరస్థుడు, మద్యం వ్యాపారి అమిత్​రామ్​.. వాచ్​మెన్ కంటపడ్డాడు. గురుదేవ్ ధైర్యం చేసి అమిత్​రామ్​ను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. వీరి మధ్య కాసేపు తోపులాట జరిగింది. ఆ తర్వాత నిందితుడి సహచరులు నలుగురు వచ్చి.. తుపాకీతో గురుదేవ్ తలపై కాల్పులు జరిపారు. దీంతో గురుదేవ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వాచ్​మన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి: ఇండిగో విమానంలో మంటలు.. టేకాఫ్ సమయంలో ఇంజిన్ ఫెయిల్.. లక్కీగా..

ప్రపంచంలోనే ఎత్తైన శివుడి విగ్రహం.. విశేషాలు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.