ETV Bharat / bharat

తల్లీకూతుళ్లపై 8మంది గ్యాంగ్​ రేప్​.. ప్రైవేట్​ పార్ట్​లపై కారం చల్లి..

author img

By

Published : Jul 4, 2023, 7:39 PM IST

Updated : Jul 4, 2023, 8:01 PM IST

తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఎనిమిది మంది కామాంధులు. అక్కడితో ఆగకుండా ఇద్దరు మహిళల జననాంగాలపై కారం చల్లారు. ఈ దారుణ ఘటన అసోంలో వెలుగుచూసింది. మరోవైపు.. 13 ఏళ్ల మైనర్​పై ఏడాదిన్నర ఆమె తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో తండ్రి చెర నుంచి తప్పిస్తామని చెప్పి మరో ఇద్దరు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం రాజస్థాన్​లో జరిగింది.

gangrape
సామూహిక అత్యాచారం

మూగ మహిళ, ఆమె కూతురిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు. అంతేకాకుండా వారి జననాంగాలపై కారం చల్లారు. ఈ హృదయవిదారక ఘటన అసోం.. గువాహటిలోని సత్​గావ్​లో జరిగింది. మే 17న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళలపై అఘాయిత్యానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. పరారీలో ఉన్న మరో నలుగురు నిందితులు కోసం గాలిస్తున్నారు.

అసలేం జరిగిందంటే?
మే 17వ తేదీ రాత్రి సత్‌గావ్‌కు చెందిన అమిత్‌ ప్రధాన్‌ సహా అతడి సహచరులు ఎనిమిది మంది.. బాధితురాలి ఇంట్లోకి ప్రవేశించారు. నిందితులందరూ కలిసి మూగ మహిళ, ఆమె కుమార్తెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారి జననాంగాలపై కారం చల్లారు. దీంతో ఇద్దరు బాధితురాళ్లు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వారి ఇరుగుపొరుగువారు.. సత్​గావ్ పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మహిళ, ఆమె కుమార్తెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారి ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల వారిద్దర్నీ గువాహటి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అమిత్ ప్రధాన్, బిమల్ ఛెత్రి, ఛాయా ప్రధాన్, సంధ్యా సోనార్ అనే నలుగురు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. మిగతా నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నామని సత్​గావ్ పోలీసులు తెలిపారు.

మైనర్​పై రేప్​..
కన్నతండ్రే కూతురు పట్ల కసాయిలా ప్రవర్తించాడు. 13 ఏళ్ల మైనర్​పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తండ్రి అఘాయిత్యాల నుంచి మైనర్​ను కాపాడుతానని చెప్పాడు ఓ యువకుడు(29). బాధితురాలిని తన ఇంటికి తీసుకెళ్లి.. స్నేహితుడితో కలిసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం రాజస్థాన్​.. కోటాలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమె తండ్రి, అత్యాచారానికి పాల్పడిన మరో ఇద్దరిని బరాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారు ముగ్గురిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.

జూన్​ 22న బాధితురాలు ఇంట్లో నుంచి పారిపోయింది. జూన్ 26న ఆమె తండ్రి.. తన కుమార్తె కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మైనర్​ కోసం తీవ్రంగా గాలించారు. జూన్​ 30 బాధితురాల ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. 'నా తండ్రి ఏడాదిన్నర కాలంగా నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ వేధింపులు గురించి ఎవరికైనా చెబితే నన్ను చంపేస్తానని బెదిరించాడు. నా తల్లి ఐదేళ్ల క్రితమే మరణించింది. జూన్ 22న ఓ వ్యక్తి నన్ను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత తన స్నేహితుడితో కలిసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు' అని పోలీసులకు బాధితురాలు వాంగ్మూలం ఇచ్చింది.

యువకుడిపై లైంగిక వేధింపులు..
ఇంట్లో ఎవరూ లేని సమయంలో 19 ఏళ్ల యువకుడిని లైంగికంగా వేధించారు ఇద్దరు కామాంధులు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్​లో జరిగింది. ఈ కేసులో అనికేత్, ఇర్ఫాన్​లపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు ఇర్ఫాన్​ను పోలీసులు అరెస్ట్ చేయగా.. అనికేత్​ కోసం గాలిస్తున్నారు.

మానసిక రోగిపై వేధింపులు..
మరోవైపు.. మానసిక వైద్యశాలలో 16 ఏళ్ల మైనర్​ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు కొందరు వ్యక్తులు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని ఎరవాడలో జరిగింది. బాధితుడి తల్లి ఫిర్యాదు నలుగురు సెక్యూరిటీ గార్డులు సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదుచేశారు. బాధితుడిని ఎరవాడలోని ప్రాంతీయ మానసిక వైద్యశాలలో చేర్పించారు పోలీసులు.

Last Updated :Jul 4, 2023, 8:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.