జైలులో ఆ పాట వినాలని ఖైదీ కోరిక.. చివరకు

author img

By

Published : Sep 15, 2021, 4:28 PM IST

prisoner request on song

జైలులో తనకు ఇష్టమైన పాట పెట్టాలంటూ ఓ ఖైదీ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. న్యాయస్థానం అందుకు అంగీకరించినా.. ఆ ఖైదీ కోరిక నెరవేరలేదు. అసలు ఏం జరిగిందంటే..?

జైలులో తనకు ఇష్టమైన పాట పెట్టాలని కోర్టుకు విన్నవించుకున్నాడో ఖైదీ. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. అతడు అడిగిన పాట పెట్టాలని జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయినా.. ఖైదీకి ఆ పాట వినే అవకాశమే రాలేదు.

కేరళ తిరువనంతపురంలోని పూజపుర సెంట్రల్​​ జైలులో గత కొంతకాలంగా శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీకి జైలులో తనకు ఇష్టమైన పాటను వినాలన్నది కోరిక. ఇందుకోసం అధికారులకు విజ్ఞప్తి చేసేందుకు సిద్ధమయ్యాడు. 1980ల్లోని మలయాళ చిత్రం 'అంగడి'లోని 'కన్నుమ్​ కన్నుమ్​ తమ్మిల్​ తమ్మిల్'​ అనే పాటను పెట్టాలంటూ ఓ లేఖ రాశాడు. అయితే.. ఆ లేఖను పొరపాటున జైలు అధికారులకు అందాల్సిన లెటర్​ బాక్స్​లో కాకుండా కంప్లైంట్​ బాక్స్​లో వేశాడు.

ఈ కంప్లైంట్​ బాక్స్​లోని లేఖలను ప్రతి నెల 7వ తేదీన జిల్లా జడ్జి పరిశీలిస్తారు. ఈ క్రమంలో ఆ ఖైదీ రాసిన లేఖ కూడా జడ్జి దృష్టికి వచ్చింది. ఖైదీ విజ్ఞప్తి మేరకు అతను అడిగిన పాటను పెట్టాలని జైలు అధికారులను ఆదేశించింది. కానీ.. అప్పటికే ఆ ఖైదీ తన శిక్షను ముగించుకుని విడుదలయ్యాడు.

ఇదీ చూడండి : 'స్పుత్నిక్​ లైట్'​ మూడోదశ ట్రయల్స్​కు డీసీజీఐ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.