ETV Bharat / bharat

Design Tech MD Vikas Khanvilkar Reacts to CBN Arrest: స్కిల్ ఒప్పందంలో అవినీతికి తావేలేదు.. చంద్రబాబును అరెస్టు చేయడం దురదృష్టకరం..: డిజైన్‌టెక్‌ ఎండీ

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2023, 7:16 AM IST

Design Tech MD Vikas Khanvilkar Reacts to CBN Arrest: స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతికి తావులేదని.. డిజైన్‌టెక్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ ఎండీ వికాస్ ఖన్వీల్కర్ తేల్చిచెప్పారు. దర్యాప్తు సంస్థలు ఈ ప్రాజెక్టుకు సంబంధించి.. తమతో సంప్రదించలేదని.. వారు ఆడిటర్లను పంపితే వూర్తి లెక్కలు చూపుతామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులో స్కాం జరిగిందంటూ.. మాజీ సీఎం చంద్రబాబును అరెస్టు చేయడం దురదృష్టకరమని అన్నారు.

Design_Tech_MD_Vikas_Khanvilkar_Reacts_to_CBN_Arrest
Design_Tech_MD_Vikas_Khanvilkar_Reacts_to_CBN_Arrest

Design Tech MD Vikas Khanvilkar Reacts to CBN Arrest: స్కిల్ ఒప్పందంలో అవినీతికి తావేలేదు.. చంద్రబాబును అరెస్టు చేయడం దురదృష్టకరం..: డిజైన్‌టెక్‌ ఎండీ

Design Tech MD Vikas Khanvilkar Reacts to CBN Arrest: సీమెన్స్ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని.. ఇది కేవలం సేవా పన్నులకు సంబంధించిన విషయమే అని డిజైన్టెక్ సిస్టమ్స్ వ్యవస్థాపక ఛైర్మన్, ఎండీ వికాస్ ఖన్వీల్కర్ స్పష్టం చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలతో కూడిన వీడియోను విడుదల చేశారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక జర్మనీ పర్యటనలో భాగంగా సీమెన్స్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించారని.. భారత్​లో నైపుణ్యాభివృద్ధికి మంచి అవకాశాలున్నాయని ఆయన భావించారని చెప్పారు.

Design Tech MD on Chandrababu Arrest: అందులో భాగంగా నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయని తెలిపారు. గుజరాత్ ప్రభుత్వం అమలు చేస్తున్న నమూనా ప్రాజెక్టును.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని కార్యదర్శుల స్థాయి సీనియర్ అధికారుల బృందం అప్పట్లో పరిశీలించిందన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్, సీమెన్స్, డిజైన్టెక్ సంస్థల మధ్య చర్చలు జరిగాయని.. ఏపీలో గ్రాడ్యుయేట్ విద్యార్థులతోపాటు డిప్లొమా, ఐటీఐ విద్యార్థులకు కూడా శిక్షణకు సంబంధించిన ప్రయోజనాలను అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

TDP Leaders Protests Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్​ను వ్యతిరేకిస్తూ నిరసన జ్వాలలు.. పలుచోట్ల ఉద్రిక్తత

No Corruption in AP Skill Development Program: ప్రాజెక్టు అమలుకు చాలా కళాశాలలు ముందుకు రాగా.. కేంద్రాలను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిందని ఖన్వీల్కర్ తెలిపారు. ఒప్పందంలో భాగంగా పరికరాలు నాసిరకంగా ఉన్నా, మరమ్మతులు వచ్చినా బాధ్యత తీసుకున్నామన్నారు. శిక్షణ సిబ్బందిని సమకూర్చుకుని 2 లక్షల 13వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. వారు ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నప్పుడు 75 వేల మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందినట్లు తెలిపారు.

Design Tech MD Vikas on CBN Arrest: కియా మోటార్స్‌ సంస్థ తమను సంప్రదించి.. వాళ్ల కార్మికులకు తమ శిక్షణ ఇవ్వాలని కోరారని, తమ ఫ్యాకల్టీ కియా మోటార్స్ సిబ్బందికి శిక్షణ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. శుశిక్షితులైన మానవ వనరుల వల్లే ఇది సాధ్యమైందన్న ఆయన.. తప్పుడు ఆరోపణలతో తమ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని, చేయనిదానికి శిక్ష అనుభవిస్తున్నామని ఖన్వీల్కర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Chandrababu Family Members Mulakat: చంద్రబాబు భద్రతపై భయంగా ఉంది.. ఇది ఎంతో క్లిష్ట సమయం: భువనేశ్వరి

"241కోట్ల రూపాయలకు సంబంధించి అందించిన సేవల రశీదులు, పూర్తి వివరాలు ఉన్నాయి. పన్నులు చెల్లించాం. తప్పుడు ఆరోపణలతో ప్రతిష్ఠ దెబ్బతింటోంది. చిన్న మొత్తానికి పెద్ద వ్యక్తులు అరెస్టు కావడం చూస్తున్నాం. ఇలాంటి ఆరోపణలతో మా సంస్థకు చెడ్డ పేరు వస్తోంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. నేరం నిరూపించకుండానే శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇలాంటి వేధింపుల వల్ల సంస్థ మనుగడే కష్టం. సిబ్బంది ఉద్యోగాలు కోల్పోతారు." - ఖన్వీల్కర్, డిజైన్‌టెక్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌

TDP Chandrababu Naidu Arrest: తమపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఖన్వీల్కర్ చెప్పారు. ఇది కేవలం సర్వీస్ ట్యాక్స్‌కు సంబంధించిన అంశమేనని.. మా అమ్మకందారు పన్ను డిపాజిట్ చేయలేదని చెప్పారు. అది తమ బాధ్యత కాదన్నారు. ప్రాజెక్టులో దోపిడీకి అవకాశమే లేదని, తాము ఎవరికీ ఎలాంటి మొత్తాన్ని చెల్లించలేదని స్పష్టం చేశారు. చంద్రబాబుకే కాదు, మరెవరికీ ఎలాంటి సొమ్ము ఇవ్వలేదని షెల్ కంపెనీల ద్వారా తరలించారనేదీ అవాస్తవమని తేల్చి చెప్పారు. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేయడం బాధాకరమని చెప్పారు.

"ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని ఖర్చుల వివరాలు ఇందులో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు రూ. 371కోట్లు. మా మార్జిన్‌ రూ. 70.8కోట్లు. పూర్తి వివరాలు దర్యాప్తు సంస్థలకు అందజేశాం. కానీ వాళ్లు తీసుకెళ్లలేదు. ఇందులో ఎలాంటి మోసం లేదు. ఎవరికీ సొమ్ములు చెల్లించలేదు. చంద్రబాబు, మరెవరికీ డబ్బులు ఇవ్వలేదు." - ఖన్వీల్కర్, డిజైన్‌టెక్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌

Vikas Khanvilkar Reaction on Chandrababu Arrest: కేసులో విచారణ సంస్థలు తమను సంప్రదించలేదని ఖన్వీల్కర్ వివరించారు. ప్రాజెక్టులో సేవలు, ఉత్పత్తులకు సంబంధించి అన్ని ఖర్చులకు రశీదుల వారీగా వివరాలు ఉన్నాయని, షెల్ కంపెనీల ద్వారా నిధులు తరలించారనేది సరికాదని.. ఎలాంటి అవకతవకలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు.

I Am with Babu Song on Chandrababu Naidu: ఐయామ్ విత్ బాబు..'పోరాట సింహం' చంద్రబాబుకు సంఘీభావం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.