ETV Bharat / bharat

కొత్త కేసుల్లో 'డెల్టా' రకమే అధికం!

author img

By

Published : Jul 22, 2021, 10:39 PM IST

దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో ఇతర వేరియంట్లతో పోలిస్తే డెల్టా రకమే ఎక్కువగా ఉన్నట్లు కొవిడ్‌-19పై ఏర్పాటైన కన్సార్టియం ప్రకటించింది. అయితే ఈ రకం వైరస్‌ సోకిన కేసుల్లో కేవలం 10 శాతం మాత్రమే ఆస్పత్రిలో చేరాల్సి వస్తోందని, మరణాల రేటు కూడా స్వల్పంగా ఉన్నట్లు పేర్కొంది. డెల్టా కంటే ఎక్కువ ప్రమాదకరమైన ఉపరకాలకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు లేవని కొవిడ్‌ కన్సార్టియం వెల్లడించింది.

Delta variant
డెల్టా వేరియంట్​ కేసులు

దేశవ్యాప్తంగా కొత్తగా వెలుగు చూస్తున్న కరోనా కేసుల్లో డెల్టా వేరియంట్‌ ప్రభావమే ఎక్కువగా ఉన్నట్లు కొవిడ్‌పై ఏర్పాటైన కన్సార్టియం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగానూ వైరస్‌ విజృంభణకు ఈ రకమే కారణమని పేర్కొంది. ముఖ్యంగా ఆగ్నేయాసియాతో పాటు ఇతర దేశాల్లోనూ డెల్టా రకం కేసులే ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.

దేశంలో వైరస్‌ వ్యాప్తి, వాటి ఉత్పరివర్తనాలను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేతృత్వంలో 28 జాతీయ ల్యాబ్‌లు కలిసి ఓ కన్సార్టియంగా ఏర్పాటయ్యాయి. పాజిటివ్‌ వచ్చిన వారి నుంచి రక్త నమూనాలను సేకరించి వాటి జన్యుక్రమాన్ని విశ్లేషించే పని చేస్తున్న ఈ కన్సార్టియం కొత్త వేరియంట్లు, వాటి ప్రభావాలను అంచనా వేస్తుంది.

90 శాతం డెల్టా రకమే..

టీకా తీసుకున్న తర్వాత కూడా వైరస్‌ బారినపడుతున్న వారిలోనూ డెల్టా వేరియంట్‌ రకమే దాదాపు 90శాతం ఉన్నట్లు ఐసీఎంఆర్​ అధ్యయనంలో తేలింది. ఈ వేరియంట్‌ సోకిన కేసుల్లో 9.8 శాతం మంది మాత్రమే ఆస్పత్రిలో చేరాల్సి వస్తోందని కొవిడ్‌పై ఏర్పాటైన కన్సార్టియం పేర్కొంది. మరణాల రేటు 0.4శాతంగా ఉన్నట్లు ఐసీఎంఆర్​ నివేదిక ద్వారా వెల్లడైనట్లు తెలిపింది.

లాంబ్డా నిల్​..

దేశంలో డెల్టా వేరియంట్‌ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు లాంబ్డా కేసులు లేవని కొవిడ్‌పై ఏర్పాటైన కన్సార్టియం స్పష్టం చేసింది. బ్రిటన్‌లో ఈరకం వైరస్‌ ప్రభావం కొనసాగుతున్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి: కట్నం తేనందని భార్యతో యాసిడ్ తాగించిన భర్త!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.