ETV Bharat / bharat

Cyber Towers Silver Jubilee Celebrations: చంద్రబాబు నినాదాలతో మార్మోగిన గచ్చిబౌలి స్టేడియం.. సీబీఎన్ గ్రాటిట్యూట్ కార్యక్రమానికి విశేష స్పందన

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 29, 2023, 9:49 PM IST

Updated : Oct 30, 2023, 8:36 AM IST

Cyber Towers Silver Jubilee Celebrations: చంద్రబాబుకు మద్దతుగా' జై సీబీఎన్' నినాదాలతో హైదరాబాద్ గచ్చిబౌలి మైదానం మార్మోగింది. చంద్రబాబు విజన్‌తో నిర్మించిన సైబర్ టవర్స్‌కు 25 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా.. ఐటీ ఉద్యోగులు భారీ స్థాయిలో సంగీత విభావరి నిర్వహించారు. వేలాది మంది ఐటీ ఉద్యోగులు, చంద్రబాబు అభిమానులు తరలివచ్చి.. మేమున్నామంటూ కృతజ్ఞత తెలిపారు.

Cyber Towers Silver Jubilee Celebrations
Cyber Towers Silver Jubilee Celebrations

Cyber Towers Silver Jubilee Celebrations: చంద్రబాబు నినాదాలతో మార్మోగిన గచ్చిబౌలి స్టేడియం.. సీబీఎన్ గ్రాటిట్యూట్ కార్యక్రమానికి విశేష స్పందన

Cyber Towers Silver Jubilee Celebrations: హైదరాబాద్ గచ్చిబౌలి మైదానంలో ఐటీ ఉద్యోగులు నిర్వహించిన సీబీఎన్ గ్రాటిట్యూట్ కార్యక్రమానికి (CBN Gratitude Concert) విశేష స్పందన లభించింది. నగర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఐటీ ఉద్యోగులు, చంద్రబాబు అభిమానులు వేలాదిగా గచ్చిబౌలి మైదానానికి చేరుకొని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సైబర్‌ బాబుకు సంఘీభావంగా గళమెత్తారు.

తమ జీవితాలకు దారి చూపిన దార్శనికుడిని జైలులో బంధించడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం గెలిస్తుందనే నమ్మకం తమకు ఉందన్న ఐటీ ఉద్యోగులు... చంద్రబాబు అంటే పేరు మాత్రమే కాదని, అది ఒక బ్రాండ్ అంటూ నినదించారు. అందుకే ఆయన పట్ల గౌరవాన్ని చాటుకోడానికి సుమారు 1200 మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కార్యక్రమం కోసం ఎంతో కష్టపడ్డారని చెప్పారు.

TDP Pattabhi Ram on Sand Tenders: టెండర్లలో గోల్ మాల్.. ఇసుకాసురుడు కాజేసిన వేల కోట్లు కక్కించే వరకూ విశ్రమించం: పట్టాభిరామ్

ఐటీ ఉద్యోగులు తలపెట్టిన ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబసభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయి చంద్రబాబుతో ఉన్న వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అక్రమంగా కారాగారంలో పెట్టినా... చంద్రబాబు ప్రతిష్ఠ 100 రేట్లు పెరిగిందని, బతుకున్న వ్యక్తులకు.. ఈ స్థాయిలో కృతజ్ఞతలు తెలపడం తానెప్పుడూ చూడలేదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు త్వరలోనే బయటకి వస్తారని దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పారు.

చంద్రబాబు నాయుడు సేవలను ఈ రోజు మనమంతా గుర్తు చేసుకుంటుంటే... ఆయనను అక్రమంగా జైలులో నిర్బంధించడం దారుణమని.. విశ్లేషకుడు నల్లమోతు చక్రవర్తి పేర్కొన్నారు. చంద్రబాబు విజన్‌ వల్లనే ఈ రోజు భాగ్యనగరం ఈ స్థాయిలో డెవలప్​ అయిందని.. సీనియర్ జర్నలిస్ట్‌ కందుల రమేష్‌ అన్నారు. జనం కోసం నిరంతరం పాటు పటే వ్యక్తికి, తమకు చేసిన మేలును గుర్తు పెట్టుకుని కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకు, ఉద్యోగులకు, అభిమానులకు చంద్రబాబు తరఫున తెదేపా అధికార ప్రతినిధి రాజేష్‌ కృతజ్ఞతలు తెలిపారు.

TDP Kallu Teripiddam Program: జగనాసురుడికి 'కళ్లు తెరిపిద్దాం'.. మరో వినూత్న నిరసన కార్యక్రమానికి లోకేశ్ పిలుపు

సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు జరిగిన ఈ కృతజ్ఞత సభకు వేలాది మంది అభిమానులు, ఐటీ ఉద్యోగులు కుటుంబసమేతంగా రావడంతో గచ్చిబౌలి స్టేడియం జనసంద్రంగా మారింది. పలువురు ఐటీ ఉద్యోగులు మైదానంలో నేలపై పొర్లు దండాలు పెట్టి కృతజ్ఞత చాటుకున్నారు.

సీబీఎన్ గ్రాటిట్యూట్ కార్యక్రమంలో బెంగళూరు నుంచి వచ్చిన బీట్ గురు బ్యాండ్ బృందం అద్భుతమైన మ్యూజిక్​తో యువతను ఉర్రూతలూగించింది. అలాగే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్‌ తన బృందంతో కలిసిన చంద్రబాబుపై ప్రత్యేకంగా ఆలపించిన పాటలు మైదానంలో ఉన్నవారిని ఉత్తేజపరిచాయి.

TDP Leader Ayyannapatrudu on CBN Arrest: చంద్రబాబు అరెస్టును వైసీపీ నాయకులూ తప్పుబడుతున్నారు : అయ్యన్నపాత్రుడు

Last Updated : Oct 30, 2023, 8:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.