ETV Bharat / bharat

111అడుగుల ఎత్తైన కేక్​తో సీఎం బర్త్​డే వేడుకలు.. ప్రపంచ రికార్డు!

author img

By

Published : Jun 6, 2022, 10:07 AM IST

Yogi Adityanath Birthday: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక భాజపా కార్యకర్త అమీర్ జైదీ.. 111.6 అడుగుల ఎత్తైన కేక్‌ను తయారు చేయించి కట్​ చేశారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన కేక్​ను కట్ చేసి రికార్డు సృష్టించాలన్న లక్ష్యంతో ఇలా చేసినట్లు ఆయన తెలిపారు.

Yogi Adityanath Birthday
Yogi Adityanath Birthday

యోగి ఆదిత్యనాథ్​ పుట్టినరోజు వేడుకలు.. 111.6 అడుగలు కేక్​ను కట్​ చేసిన అభిమానులు

Yogi Adityanath Birthday 111 Feet Cake: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఆదివారం 51వ పడిలోకి అడుగుపెట్టారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అభిమానులు వివిధ రూపాల్లో ఘనంగా వేడుకలను నిర్వహించారు. నవాబ్‌గంజ్ అసెంబ్లీ పరిధి, సెంథాల్​ పట్టణంలోని భాజపా కార్యకర్త అమీర్​ జైదీ.. 111.6 అడుగుల ఎత్తైన కేక్​ను తయారు చేయించి కట్​ చేశారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు వచ్చారు.

Yogi Adityanath Birthday
111.6 అడుగుల భారీ కేక్​

రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలు నెలకొల్పేందుకు ముఖ్యమంత్రి చేసిన కృషికి గాను ఈ కేక్‌ను 'పీస్‌ ఆఫ్‌ కేక్​'గా అమీర్​ జైదీ అభివర్ణించారు. ప్రపంచరికార్డు సాధించాలన్న లక్ష్యంతో ఈ భారీ కేక్​ను తయారు చేయించినట్లు పేర్కొన్నారు. 40 మంది సిబ్బంది కలిసి 40 క్వింటాళ్ల కేక్​ను తయారు చేశారని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కేక్‌ను తయారు చేయించి రికార్డు సృష్టించినట్లు తెలిపారు. మరోవైపు అయోధ్యలో 5 లక్షల మంది యోగి అభిమానులు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.

Yogi Adityanath Birthday
కార్యక్రమానికి హజరైన అభిమానులు

ఇవీ చదవండి: మంత్రి ఇంటిపై ఈడీ దాడులు.. మనీ లాండరింగ్ కేసులో కొత్త ఆధారాలు!

విరిగిన స్టీరింగ్.. లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. 26 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.