ETV Bharat / bharat

ఛత్తీస్‌గఢ్‌ బీజేపీదే- మేజిక్ ఫిగర్​ దాటేసిన కమలం పార్టీ

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 8:01 AM IST

Updated : Dec 3, 2023, 5:41 PM IST

Chhattisgarh Elections Results 2023 in Telugu : ఛత్తీస్​గఢ్ శాసనసభ ఎన్నికల్లో ప్రతిపక్ష బీజేపీ ఘన విజయం సాధించింది. మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంది.

Chhattisgarh Elections Results 2023 in Telugu
Chhattisgarh Elections Results 2023 in Telugu

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

5.41 PM

ఛత్తీస్‌గఢ్‌లో ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలు తారుమారు చేస్తూ ప్రతిపక్ష బీజేపీ ఘన విజయం సాధించింది. రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, మేజిక్​ ఫిగర్ 46 ను దాటి దూసుకెళ్లింది బీజేపీ. మరో 11 స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్​ 27 స్థానాల్లో గెలుపొందగా, మరో 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

5.21 PM

ఛత్తీస్​గఢ్​లో మేజిక్​ ఫిగర్​ దిశగా వెళుతోంది బీజేపీ. 34 స్థానాల్లో గెలుపొందగా మరో 22 సీట్లలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్​ 18స్థానాల్లో గెలిచి, మరో 16 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్​ విజయం సాధించారు.

  • 4.07 PM

ఛత్తీస్​గఢ్​ మాజీ ముఖ్యమంత్రి రమణ్​ సింగ్​ 40వేలకు పైగా మెజారిటీతో కాంగ్రెస్​ అభ్యర్థిపై విజయం సాధించారు. బీజేపీ 17 సీట్లలో గెలుపొందగా.. మరో 40కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 25 స్థానాల్లో కాంగ్రెస్​ ముందంజలో ఉండగా, 6 సీట్లలో విజయం సాధించింది.

  • 3.14 PM

ఛత్తీస్​గఢ్​లో అధికార కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. మరో 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 50కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంటూ, 3 సీట్లు గెలుపొందింది.

  • 2.22 PM

ఛత్తీస్​గఢ్​లో అధికారం దిశగా దూసుకెళ్తున్న బీజేపీ.. బోణీ కొట్టింది. లుంద్రా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ప్రబోజ్​ భింజ్​ విజయం సాధించారు. బీజేపీ 50కి పైగా సీట్లలో ముందంజలో ఉండగా.. కాంగ్రెస్​ 35కి లోపు సీట్లతో వెనుకంజలో ఉంది. పటాన్ స్థానంలో ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్​, ఉపముఖ్యమంత్రి టీఎస్ సింగ్ దేవ్ వెనుకంజలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి రమణ్​ సింగ్​​ ముందంజలో ఉన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అరుణ్​ సావో సైతం ముందంజలో కొనసాగుతున్నారు.

  • 1.33 PM
    ఛత్తీస్​గఢ్​లో బీజేపీ విజయం దిశగా కొనసాగుతోంది. 52 చోట్ల ఆధిక్యం కనబరుస్తోంది.
  • 1.04 PM

ఛత్తీస్​గఢ్​లో ప్రతిపక్ష బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. బీజేపీ 50కి పైగా సీట్లలో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్​ 35 స్థానాల లోపు పరిమితమైంది. పటాన్ స్థానంలో ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్​, మాజీ ముఖ్యమంత్రి రమణ్​ సింగ్​​ ముందజలో ఉన్నారు. ఉపముఖ్యమంత్రి టీఎస్ సింగ్ దేవ్ వెనుకంజలో ఉన్నారు.

  • 12.30 PM

ఛత్తీస్​గఢ్​లో ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలను మారుస్తూ ప్రతిపక్ష బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. బీజేపీ 50కి పైగా సీట్లలో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్​ 35 స్థానాల లోపు పరిమితమైంది. పటాన్ స్థానంలో ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్​ ముందంజలోకి వచ్చారు. ఉపముఖ్యమంత్రి టీఎస్ సింగ్ దేవ్ వెనుకంజలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి రమణ్​ సింగ్​​ ముందజలో ఉన్నారు.

  • 11.51 AM

ఛత్తీస్​గఢ్​లో ప్రతిపక్ష బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. మొదటి నుంచి హోరాహోరీగా సాగుతున్న పోరులో బీజేపీ 50కి పైగా సీట్లలో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్​ 40 స్థానాల లోపు పరిమితమైంది. పటాన్ స్థానంలో ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్​, ఉపముఖ్యమంత్రి టీఎస్ సింగ్ దేవ్ వెనుకంజలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి రమణ్​ సింగ్​​ ముందజలో ఉన్నారు.

  • 10.46 AM

ఛత్తీస్​గఢ్​లో ప్రతిపక్ష బీజేపీ ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. మొదటి నుంచి హోరాహోరీగా సాగుతున్న పోరులో బీజేపీ 48 సీట్లలో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్​ 40 స్థానాలతో వెనుకబడింది. పటాన్ స్థానంలో ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్​ ముందంజలో ఉండగా.. ఉపముఖ్యమంత్రి టీఎస్ సింగ్ దేవ్ వెనుకంజలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి రమణ్​ సింగ్​​ ముందజలో ఉన్నారు.

  • 10.00 AM

ఛత్తీస్​గఢ్​లో రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ నడుమ పోరు హోరాహోరీగా సాగుతోంది. రెండు పార్టీలు 40కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా​ కేవలం రెండు, మూడు సీట్ల తేడానే కొనసాగుతోంది. పటాన్ స్థానంలో ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్​, ఉపముఖ్యమంత్రి టీఎస్ సింగ్ దేవ్, మాజీ ముఖ్యమంత్రి రమణ్​ సింగ్​​ ముందజలో ఉన్నారు.

  • 9.43 AM

ఛత్తీస్​గఢ్​లో రెండు జాతీయ పార్టీల నడుమ పోరు ఉత్కంఠగా కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్​ మధ్య ఆధిక్యం ఒకటి, రెండు సీట్ల తేడానే ఉంటుంది. పటాన్ స్థానంలో ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్​, ఉపముఖ్యమంత్రి టీఎస్ సింగ్ దేవ్, మాజీ ముఖ్యమంత్రి రమణ్​ సింగ్​​ ముందజలో ఉన్నారు.

  • 9.15 AM

ఛత్తీస్​గఢ్​లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్​, బీజేపీకి మధ్య రెండు, మూడు సీట్ల ఆధిక్యంలోనే తేడానే కొనసాగుతోంది.

  • 9.00AM
    ఛత్తీస్​గఢ్​లో పోస్టల్ బ్యాలెట్లు అధికంగా కాంగ్రెస్​కు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ల అనంతరం కాంగ్రెస్ 45 స్థానాల్లో ముందంజలో ఉంది. మొత్తం స్థానాలు 90 కాగా మెజార్టీ స్థానాల్లో హస్తం పార్టీ ఆధిక్యం కనబరుస్తోంది. మరోవైపు, బీజేపీ 32 సీట్లలో లీడింగ్​లో ఉంది.
  • 8.30AM
    ఛత్తీస్​గఢ్​లో కాంగ్రెస్ పార్టీ 7 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. 3 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది.
  • 8.00 AM

Chhattisgarh Elections Results 2023 in Telugu : ఛత్తీస్​గఢ్​లో రెండు విడతల్లో జరిగిన శాసనసభ ఎన్నికల పోలింగ్​కు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్​ ప్రక్రియ మొదలైంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపు కేంద్రాలతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తును ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఓటింగ్‌ కేంద్రం వద్దకు ఇతరులు ఎవరూ రాకుండా, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భద్రతా సిబ్బందిని నియమించారు. పెద్దఎత్తున కేంద్ర బలగాలను మోహరించారు.

మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో పోలింగ్‌ జరిగింది. నవంబర్‌ 7న నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలైన 20 స్థానాలకు తొలి విడతలో, మిగిలిన 70 స్థానాలకు నవంబర్‌ 17న రెండో విడతలో పోలింగ్‌ జరిగింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఎగ్జిట్‌ పోల్స్ కూడా హస్తం పార్టీకే అధికారమని అంచనాలు ప్రకటించాయి. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 90 ఉండగా మెజార్టీ మార్కు 46 వచ్చిన పార్టీ అధికారం చేపట్టనుంది.

Last Updated :Dec 3, 2023, 5:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.