ETV Bharat / bharat

రూపాయికే వైద్య సేవలు.. ఉచితంగానే మందులు.. ముఖ్యమంత్రే ఆదర్శం!

author img

By

Published : Feb 9, 2023, 10:01 AM IST

chhattisgarh one rupee doctor
chhattisgarh one rupee doctor

ప్రస్తుత రోజుల్లో చిన్న రోగం వచ్చి ఆస్పత్రులకు వెళ్తే చాలు.. వైద్య ఖర్చులకు జేబులన్నీ ఖాళీ అవుతున్నాయి. కానీ.. ఓ వైద్యుడు మాత్రం కేవలం రూపాయి ఫీజు తీసుకుని చికిత్స చేస్తున్నారు. ఆ డబ్బులను కూడా సామాజిక సేవకు వినియోగిస్తున్నారు. నాలుగేళ్లుగా ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఆ ఒక్క రూపాయి డాక్టర్.. ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం.

చిన్నపాటి ట్రీట్‌మెంట్‌కే లక్షల రూపాయలు ఖర్చవుతున్న ఈ రోజుల్లో.. ఛత్తీస్​గఢ్​లోని రాయ్​పుర్​కు చెందిన డాక్టర్ వినయ్​ వర్మ.. గత నాలుగేళ్లుగా కేవలం ఒక్క రూపాయికే వైద్య సేవలు అందిస్తున్నారు. ఇలా వచ్చిన కొద్ది మొత్తాన్ని కూడా సామాజిక కార్యక్రమాలు చేపట్టేవారికి విరాళంగా ఇస్తున్నారు. కాగా, ఆయన రాయ్​పుర్​ అంబేడ్కర్​ ప్రభుత్వాసుపత్రిలో చీఫ్ మెడికల్​ ఆఫీసర్​గా విధులు నిర్వర్తిస్తున్నారు. సొంత క్లినిక్​లో రూపాయికే వైద్యం అందిస్తున్నారు. తాజాగా ఈటీవీ భారత్​తో వినయ్ వర్మ ప్రత్యేకంగా మాట్లాడారు. తాను అందిస్తున్న వైద్య సేవల గురించి వివరించారు.

ఈటీవీ భారత్​తో మాట్లాడుతున్న డాక్టర్​ వినయ్​ వర్మ

"ఒక్క రూపాయి క్లినిక్​ ప్రారంభించి నాలుగేళ్లు అవుతోంది. ప్రతీరోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు నా ఇంట్లోనే పేషెంట్లను చూస్తాను. ఆ తర్వాత 10 నుంచి 11 గంటల వరకు నా క్లినిక్​లో వైద్య సేవలందిస్తాను. కేవలం రూపాయి మాత్రమే తీసుకుంటాను. ఆ మొత్తాన్ని కూడా సామాజిక కార్యక్రమాలు నిర్వహించేవారికి విరాళంగా ఇస్తాను."
- డాక్టర్​ వినయ్​ వర్మ

ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న నేపథ్యంలోటి.. వర్కింగ్​ డేస్​లో రోగుల కోసం ప్రత్యేక సమయం కేటాయిస్తానని తెలిపారు వినయ్​ వర్మ. సెలవు రోజుల్లో ఉదయం, మధ్యాహ్నం క్లినిక్​లో వైద్య సేవలందిస్తామని చెప్పారు. "నా వద్దకు వచ్చే చాలా మంది రోగులు మందులు కూడా కొనుగోలు చేయలేని స్థితిలో ఉంటారు. అలాంటి సమయంలో వారికి మందులు ఉచితంగా అందిస్తాను. రోజూ 30 నుంచి 40 మంది రోగులకు వైద్య సేవలు అందిస్తాను" అని డాక్టర్ వినయ్​ వర్మ చెప్పారు.
ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్​ తనకు ఆదర్శమని తెలిపారు డాక్టర్​ వినయ్​ వర్మ. రోగులను డాక్టర్లు దోచుకోవడం లేదని, ఆరోగ్యం పేరుతో వ్యాపారాలు సాగిస్తున్న వ్యక్తులే అసలైన దోషులని ఆయన అన్నారు.

ఒక్క రూపాయల డాక్టర్
ఒక్క రూపాయి డాక్టర్ వినయ్​ వర్మ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.