ETV Bharat / bharat

Central Govt Focus on Krishna Water Share to AP and Telangana : 'కృష్ణా జలాల్లో.. తెలుగు రాష్ట్రాల వాటా త్వరగా తేల్చండి'

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 4, 2023, 4:11 PM IST

Updated : Oct 4, 2023, 8:33 PM IST

Central Govt Focus on Krishna Water Share to AP and Telangana : అసెంబ్లీ ఎన్నికల ముంగిట తెలుగురాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వాటాల నిర్ణయంపై కీలక ముందడుగు పడింది. కృష్ణా నదీజలాల వివాద పరిష్కార ట్రైబ్యునల్‌ నూతన విధివిధానాల ఖరారుకు కేంద్రమంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా ఈ ట్రైబ్యునల్‌ రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల వారీగా నీటిని పంపిణీ చేస్తుందని కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర పర్యటనలో ప్రధాని మోదీ ప్రకటనలకు అనుగుణంగా గిరిజన వర్సిటీ, పసుపుబోర్డుల ఏర్పాటుకూ కేంద్ర కేబినెట్‌ పచ్చజెండా ఊపింది.

Central Govt Focus on Share Krishna Water
Central Govt Focus on Share Krishna Water to AP and Telangana

Central Govt Focus on Krishna Water Share to AP and Telangana 'కృష్ణా జలాల్లో.. తెలుగు రాష్ట్రాల వాటా త్వరగా తేల్చండి'

Central Govt Focus on Krishna Water Share to AP and Telangana : తెలంగాణ ఆకాంక్షలు, డిమాండ్లపై కేంద్రమంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం(Krishna Water Fight) పరిష్కరమయ్యేలా చర్యలు చేపట్టింది. కృష్ణా వివాదాల పరిష్కార ట్రైబ్యునల్‌-2 ద్వారా కృష్ణా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య నీటి పంపిణీకి నూతన విధివిధానాల ఖరారుకు కేంద్రమంత్రి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఇందుకు అనుగుణంగా తెలుగురాష్ట్రాల్లో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరుగుతాయని కేంద్రమంత్రి అనురాగ్‌ఠాకూర్‌(Anurag Thakur) తెలిపారు.

Krishna Water Tribunal Board : కృష్ణా నదీ జలాల పంపిణీ కోసం ఏళ్లుగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల మధ్య కేటాయింపులు జరపాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతూ వస్తోంది. 1976లో కృష్ణావాటర్‌ ట్రైబ్యునల్‌-1(​Krishna Water Tribunal Board) మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో మధ్య నీటిని పంపిణి చేస్తూ అవార్డు ఇచ్చింది. ఇందులో భాగంగా 811టీఎంసీలు కేటాయింపులు చేస్తూ ఫైనల్‌ అవార్డు ఇచ్చింది. నీటివాటాల కేటాయింపులను పునః పరిశీలించవచ్చని ఆర్డర్‌లో తెలిపింది.

"కృష్ణా జలాల వివాద ట్రైబ్యునల్‌-2 ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వివాదం పరిష్కరించేలా నీటి పంపిణీ కోసం నూతన విధి విధానాల ఖరారుకు నిర్ణయం తీసుకున్నాం. ఈ ట్రైబ్యునల్‌ కృష్ణా నదీ జలాల్ని కేటాయించనుంది. రెండు రాష్ట్రాల్లో (ఏపీ, తెలంగాణ) ఇప్పటికే ఉన్న, నిర్మాణంలో ఉన్నవాటితో పాటు భవిష్యత్‌లో ప్రతిపాదించే ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయనుంది. ఇరు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేయాలన్న తెలంగాణ డిమాండ్‌ ఇవాళ నెరవేరింది." -అనురాగ్​ ఠాకూర్​, కేంద్రమంత్రి

అనంతరం సభ్య రాష్ట్రాల విజ్ఞప్తుల మేరకు.. 2004లో కృష్ణావాటర్‌ డిస్పూట్‌ ట్రైబ్యునల్‌ -2 ఏర్పాటైంది. మార్చి 2011లో సంయుక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. నీటి వినియోగానికి సంబంధించి సుప్రీంకోర్టులో మహారాష్ట్ర, కర్ణాటకలపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. 2013 నవంబర్‌ 29న నీటి పంపకాలపై కృష్ణా ట్రైబ్యునల్‌ నివేదిక అందించింది. దీనిపై ఏపీ సహా రాష్ట్రాల అభ్యంతరాలతో గెజిట్‌ ప్రచురణ కాలేదు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో..14 జూలై 2014న తెలంగాణ ప్రభుత్వం.. కృష్ణా నీటి పంపకాల విషయాన్ని తేల్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి, ఫిర్యాదు చేసింది.

Krishna River Management Board : కేంద్రం వైపు.. కృష్ణా బోర్డు చూపు

Two Telugu States Distribution of Krishna Waters : ప్రస్తుతం ఉన్న ట్రైబ్యునల్‌ -2 కు బదులుగా మరో ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరింది. ఈ మేరకు ట్రైబ్యునల్‌ -2కి సంబంధించి కేంద్రానికి ఆదేశాలివ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 2015లో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. సమస్య పరిష్కారం కావాలని ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపిణీ చేయాలని ఇందులో కోరింది. తర్వాత కేంద్రప్రభుత్వం విజ్ఞప్తి మేరకు 2021లో తెలంగాణ సర్కార్‌ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. తర్వాత సోలిసిటర్‌ జనరల్‌ అభిప్రాయం తీసుకున్న కేంద్రప్రభుత్వం.. కృష్ణా వాటర్‌ వివాదాల పరిష్కార ట్రైబ్యునల్‌-2 రద్దు చేయడానికి బదులుగా అదనపు విధివిధానాలు చేర్చాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థకీరణలో చట్టాన్ని ఉల్లంఘించకుండా అదనపు విధివిధానాలు చేర్చేందుకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

ఎన్నికలు వస్తున్నాయనే కృష్ణా జలాల పంపిణీ : కృష్ణా జలాల పంపిణీ విషయంలో ట్రైబ్యునల్​ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రజల విజయమని మంత్రి హరీశ్​రావు అన్నారు. ఎన్నికలు వస్తున్నాయనే తొమ్మిదిన్నర ఏళ్ల తర్వాత కేంద్ర కేబినెట్​ నిర్ణయం ఎద్దేవా చేశారు. కృష్ణాజలాలు పంపిణీ చేయాలని ఏదైనా రాష్ట్రం కోరితే ఏడాదిలోపు చేయాలని.. కానీ కేంద్రం ట్రైబ్యునల్​ ఏర్పాటు చేయకుండా కాలయాపన చేసిందని విమర్శలు గుప్పించారు.

శ్రీశైలంలో జలవిద్యుత్​ ఉత్పత్తిని ఆపండి.. KRMBకి తెలంగాణ లేఖ

KRMB Letter: శ్రీశైలం జలాశయంలో విద్యుదుత్పత్తి ఆపండి: కృష్ణా బోర్డు

Last Updated :Oct 4, 2023, 8:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.