ETV Bharat / bharat

కెనడా వెళ్లనున్న వీధి శునకాలు.. బిజినెస్​ క్లాస్​లో ప్రయాణం.. ఎందుకో తెలుసా?

author img

By

Published : Jul 8, 2023, 11:11 AM IST

భారత్​ నుంచి రెండు వీధి శనకాలు కెనడా వెళ్లనున్నాయి. పంజాబ్​లోని అమృత్​సర్​కు చెందిన ఈ కుక్కలు.. జూన్​ 15న ఆ దేశానికి పయనం కానున్నాయి. ఎందుకో తెలుసా?

canada-woman-adopt-two-indian-stray-dogs-from-amritsar-dogs-will-go-to-canada
రెండు భారత వీధి కుక్కలను దత్తత తీసుకున్న కెనడా మహిళ

Canada Woman Adopt Two Indian Stray Dogs : పంజాబ్​కు చెందిన రెండు వీధి శనకాలు కెనడా వెళ్లనున్నాయి. ప్రత్యేక నిబంధనలు అనుసరించి వీటిని విదేశాలకు పంపనున్నారు. అందుకు సంబంధించిన అన్ని ప్రకియలు కూడా పూర్తయ్యాయి. త్వరలోనే ఈ శునకాలకు పాస్​పోర్ట్​లు కుడా రానున్నాయి. అనంతరం అవి కెనడాకు పయనం కానున్నాయి. అమృత్​సర్​కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ.. వీటిని కెనడాకు పంపనుంది.

విదేశాలకు ఎందుకు? అసలు విషయమేంటి?
డాక్టర్​ నవ్​నీత్​ కౌర్.. అమృత్​సర్​లో యానిమల్ వెల్ఫేర్ అండ్ కేర్ సొసైటీ(AWCS) అనే ఎన్​జీఓను నడుపుతున్నారు. శునకాల పరిరక్షణే ధ్యేయంగా ఈ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. గాయపడిన శునకాలను అక్కున చేర్చుకుని.. వాటికి ఈ సంస్థ ద్వారా చికిత్స అందిస్తున్నారు. వీధి శునకాలను దత్తత తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. సాధారణంగానే యానిమల్ వెల్ఫేర్ అండ్ కేర్ సొసైటీ(AWCS) ద్వారా వీధి కుక్కలను విదేశాలకు పంపిస్తుంటారు నవ్​నీత్​ కౌర్​.

ఈ విషయం తెలుసుకున్న కెనడాకు చెందిన బ్రెండా అనే మహిళ.. తాను కూడా రెండు వీది కుక్కలను దత్తత తీసుకోవాలని భావించింది. వెంటనే నవ్​నీత్​ కౌర్​ను సంప్రందించి.. కుక్కలను దత్తత తీసుకోవాలనే తన కోరికను వివరించింది. అందుకు సమ్మతి తెలిపిన కౌర్​.. యానిమల్ వెల్ఫేర్ అండ్ కేర్ సొసైటీ(AWCS) ద్వారా రెండు వీది కుక్కలను కెనడాకు పంపాలని నిర్ణయించుకున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. జులై 15న ఇవి కెనడాకు వెళ్లనున్నాయి.

canada-woman-adopt-two-indian-stray-dogs-from-amritsar-dogs-will-go-to-canada
కెనడాకు పంపించనున్న వీధి కుక్కలు

"వీధి శునకాలను దత్తత తీసుకోవాలనే కెనడా మహిళ కోరిక తీర్చేందుకు.. నేను డైసీ, లిల్లీ రెండు ఆడ కుక్కులను సేకరించాను. వాటినే ఆ మహిళకు పంపనున్నాం. అందుకు సంబంధించిన అన్ని లాంఛనాలు పూర్తి చేశాను. విమానంలో వీటికి రెండు బిజినెస్​ క్లాస్​ టికెట్లు కూడా బుక్​ చేశాను" అని డాక్టర్ నవ్​నీత్​ కౌర్​ వెల్లడించారు.

2020లో కరోనా లాక్​డౌన్​ సమయంలో వీధి కుక్కల సంక్షేమం కోసం యానిమల్ వెల్ఫేర్ అండ్ కేర్ సొసైటీ(AWCS) స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు నవ్​నీత్​ కౌర్​. అప్పటి నుంచి వీధి కుక్కలను చేరదీయడం, వాటికి ఆహారం అందిచడం, గాయపడిన వాటికి వైద్యం చేయడం వంటివి చేస్తున్నారు. వీధి కుక్కల పట్ల మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని సూచిస్తున్నారు సంస్థ సభ్యులు. వాటి పట్ల కనికరం చూపి.. దత్తత తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.