ఎన్నికల కోసం భాజపా భారీ ఖర్చు.. బాగా వెనుకబడిన కాంగ్రెస్​.. లెక్కలు బయటపెట్టిన ఈసీ

author img

By

Published : Sep 22, 2022, 1:51 PM IST

bjp congress election expenditure

జనవరిలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలు చేసిన ఖర్చుల వివరాలను ఈసీ విడుదల చేసింది. అందులో భాజపా రూ.340 కోట్లు ఖర్చు చేయగా.. కాంగ్రెస్​ రూ.190 కోట్లకు పైగా వ్యయం చేసింది. ఏ రాష్ట్రంలో ఎంతంటే?

  • గత జనవరిలో జరిగిన ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలు ఎంత ఖర్చు చేశాయి విషయాలను ఎన్నికల సంఘం వెల్లడించింది.
  • ఈ మేరకు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్​ చేసిన ఎన్నికల వ్యయాలను ఎన్నికల సంఘం తమ పోర్టల్​లో అందుబాటులో ఉంచింది.
  • ప్రచారం, తదితర ఖర్చుల వివరాలతో కూడిన నివేదికల్ని ఈ పార్టీలు తయారు చేసుకున్నాయి.
  • నిబంధనల ప్రకారం ఈ నివేదికల్ని ఎన్నికల సంఘానికి సమర్పించాయి భాజపా, కాంగ్రెస్.
  • ఇందులో అత్యధికంగా ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భాజపా రూ.340 కోట్లు ఖర్చు చేసింది.
  • అదే రాష్ట్రాల్లో కాంగ్రెస్​ రూ.190 కోట్లు ఖర్చు చేసింది.
  • ఉత్తర్​ప్రదేశ్​, మణిపుర్, గోవా, ఉత్తరాఖండ్​, పంజాబ్​లో జరిగిన ఎన్నికల్లో ప్రచారం కోసం భాజపా మొత్తంగా రూ.340 కోట్లు ఖర్చుచేసింది.
  • ఉత్తర్​ప్రదేశ్​లో రూ.221 కోట్లు, మణిపుర్​లో రూ.23 కోట్లు, ఉత్తరాఖండ్​లో రూ.46.67 కోట్లు, గోవాలో రూ.19 కోట్లు, పంజాబ్​లో రూ.36 కోట్లకు పైగా తమ ప్రచారం కోసం ఖర్చు చేసినట్లు భాజపా తన ఎన్నికల వ్యయం నివేదికలో పేర్కొంది.
  • అవే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం, దానికి సంబంధించిన పనులకు రూ.194 కోట్లు ఖర్చు చేసినట్లు కాంగ్రెస్​ తెలిపింది.
  • అయితే లోక్​సభ, అసెంబ్లీ ఎన్నికల్లో, పోటీ చేసే పార్టీలు కచ్చితంగా.. నిర్దేశించిన కాలపరిమితిని అనుసరించి తమ ఎన్నికల వ్యయాల నివేదికను ఎన్నికల సంఘానికి సమర్పించాలి.

ఇవీ చదవండి: నెల్లూరు, నిజామాబాద్​లోనూ PFI కలకలం.. ఎందుకీ దాడులు? అమిత్ షా లెక్కేంటి?

చారిత్రక ఎన్నికకు రంగం సిద్ధం.. కాంగ్రెస్ అధ్యక్ష పీఠం ఎవరిదో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.