ETV Bharat / bharat

ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న బైక్స్​.. ఇద్దరు మృతి.. లైవ్​ వీడియో

author img

By

Published : Dec 25, 2022, 6:41 PM IST

కేరళలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఎదురుగా వస్తున్న బైక్​ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మరణించారు. ఈ ప్రమాదం కోజికోడ్​లో జరిగింది. మరోవైపు, కారులో వెళ్తున్న నలుగురు యువకులు రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టారు. కొల్లాంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు మరణించారు.

bike accident in Kozhikode
రోడ్డు ప్రమాదం

రెండు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు యువకులు మృతి

కేరళలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు యువకులు మరణించారు. బైక్​పై వెళ్తున్న ఇద్దరు యువకులు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. ఎదురుగా వచ్చిన బైకర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం కోజికోడ్​- కోయిలాండి జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగింది. యువకులు హెల్మెట్​ పెట్టకపోవడం వల్ల తీవ్ర గాయాలై మరణించారని పోలీసులు తెలిపారు. మృతులు ఆలయ ఉత్సవానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

bike accident in Kozhikode
కోజికోడ్ రోడ్డు ప్రమాదం సీసీటీవీ దృశ్యాలు

చెట్టును ఢీకొట్టిన కారు..
కొల్లాంలోని కుందర సమీపంలో నలుగురు యువకులతో వెళ్తున్న ఓ కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఆదివారం వేకువజామున జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాద దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి.

bike accident in Kozhikode
చెట్టును ఢీకొట్టి నుజ్జునుజ్జైన కారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.