ETV Bharat / bharat

కేదార్‌నాథ్​ వెళ్లే భక్తులకు ప్రసాదంగా శివలింగాలు!

author img

By

Published : Nov 11, 2020, 10:43 AM IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్​నాథ్​ ఆలయాన్ని దర్శించిన భక్తులకు ఇకపై శివలింగాల ప్రసాదం అందుబాటులోకి రానుంది. ఈ శివలింగాలు తక్కువ ధరకే భక్తులకు లభించనున్నాయి. అంతేకాదు... ఆదిగురు శంకరాచార్య సమాధిని భక్తులు పూర్తిగా చూసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు అక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.

Now, devotees to get Siva lingas as prasad in Kedarnath temple
కేదార్‌నాథ్​లో భక్తులకు అందుబాటులో శివలింగాలు!

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించిన శివ భక్తులకు ఇకపై చిన్న శివలింగాలను అందుబాటులో ఉంచనున్నారు. ఇది మాత్రమే కాదు ఈ పుణ్యక్షేత్రంలో ఉన్న ఆదిగురు శంకరాచార్యుల సమాధిని భక్తులు పూర్తిగా చూసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు అక్కడ అభివృద్ధి పనులు చేపట్టారు అధికారులు. ఈ క్రమంలోనే పునరుద్ధరిస్తున్న మూడు గుహల్లో భక్తులు ధ్యానం కూడా చేసుకోవచ్చు

ఎలా తయారు చేస్తారంటే..?

ఈ చిన్న శివలింగాలు... కేదార్​పురి రాళ్లతో తయారు చేస్తారు. మందాకిని, సరస్వతి నదుల ఒడ్డున దొరికే చిన్న గుండ్రని రాళ్లను సేకరిస్తారు. అనంతరం పవిత్ర గంగానది జలంతో శుభ్రం చేసి చిన్న శివలింగం రూపంలో చెక్కుతారు. వీటిని వుడ్​ స్టోన్​ కన్​స్ట్రక్షన్​ కంపెనీ తయారు చేస్తుంది. ఇప్పటివరకు 10 వేలకు పైగా శివలింగాలు తయారు చేయగా... వచ్చే ఏడాది ఆలయం తెరిచే నాటికి లక్షల సంఖ్యలో శివలింగాలను తయారు చేస్తామని కంపెనీ తెలిపింది.

రెండు రంగుల్లో..

నలుపు, తెలుపు రంగుల్లో త్రిశూలదారుడి లింగాలు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. 2021లో కేదార్​నాథ్​ యాత్ర ప్రారంభమైనప్పటికే... దేశ, విదేశాల నుంచి వచ్చిన భక్తులకు తక్కువ ధరకే ఆలయానికి వచ్చే మార్గంలో వివిధ దుకాణాల్లో ఇవి లభించునున్నట్లు అధికారులు తెలిపారు.

కేదార్‌నాథ్​ స్థానిక యువతకు ఉపాధి కల్పించడానికి, ఆధ్యాత్మికతను పెంపొందించడానికి పీఎం మోదీ 'వోకల్​ ఫర్​ లోకల్​ క్యాంపెయిన్​'కు అనుగుణంగా ఈ శివలింగాల తయారీ చేపట్టినట్లు వుడ్​ స్టోన్​ కంపెనీ మేనేజర్ మనోజ్​ సెమ్వాల్​ తెలిపారు.

ఇదీ చూడండి: బిహార్​ విజయంలో మోదీనే గేమ్​ ఛేంజర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.