ETV Bharat / bharat

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్

author img

By

Published : Sep 28, 2020, 3:27 PM IST

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేరళ కాంగ్రెస్ ఎంపీ టీఎన్ ప్రతాపన్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న చట్టాలను వెంటనే రద్దు చేయాలని సుప్రీంను కోరారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సైతం.. ఈ చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీంను ఆశ్రయించనున్నట్లు స్పష్టం చేశారు.

Congress MP TN Prathapan to move Supreme Court against farm bills
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్

కొత్త వ్యవసాయ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేరళ కాంగ్రెస్ ఎంపీ టీఎన్ ప్రతాపన్ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. రైతుల(సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద చట్టం-2020 రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్​లో పేర్కొన్నారు. ఈ చట్టం చెల్లదని, వెంటనే రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరారు.

రైతుల ట్రైబ్యూనల్ ఏర్పాటు చేసే ఆదేశాలు ఇవ్వాలని ప్రతాపన్ అభ్యర్థించారు. ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. సమాంతర మార్కెట్లకు అవకాశం ఇస్తే రైతులు దోపిడీకి గురవుతారని పేర్కొన్నారు.

పంజాబ్ సైతం

మరోవైపు, వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టుకు వెళ్తామని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. నూతన చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్నారు. రైతుల ప్రయోజనాల కోసం తమ ప్రభుత్వం ఏ నిర్ణయమైనా తీసుకుంటుందన్నారు. 'బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం లభించింది కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టులో సమస్యపై పోరాడతా'మని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.