ETV Bharat / bharat

22 మందితో వెళ్తూ సముద్రంలో మునిగిన ఓడ.. ఇండియన్ కోస్ట్​గార్డ్ తెగువతో...

author img

By

Published : Jul 6, 2022, 5:02 PM IST

Porbandar Ship Sank: పోర్​ బందర్​ నుంచి యూఏఈకి వెళ్తున్న ఓ పెద్ద ఓడ అరేబియా సముద్రంలో మునిగిపోయింది. అప్రమత్తమైన ఇండియన్​ కోస్ట్​ గార్డ్​.. ఆ వాహన నౌకలోని 22 మంది సిబ్బందిని రక్షించింది.

A ship going from Porbandar to UAE sank in Arabian Sea. Coast Guard rescued Krew members
A ship going from Porbandar to UAE sank in Arabian Sea. Coast Guard rescued Krew members

Porbandar Ship Sank: గుజరాత్​లోని పోర్ బందర్ నుంచి యూఏఈకి బయల్దేరిన ఓ ఓడ.. భారీ వర్షం, గాలి కారణంగా అరేబియా సముద్రంలో మునిగిపోయింది. ఎంటీ గ్లోబల్​ కింగ్​ అనే వాహన నౌక నుంచి ప్రమాద హెచ్చరిక అందిన తర్వాత.. 22 మంది క్రూ సభ్యుల్ని రక్షించింది ఇండియన్​ కోస్ట్​ గార్డ్(ఐసీజీ)​. ఈ మేరకు ఐసీజీ ఓ ప్రకటన విడుదల చేసింది.
పోర్​ బందర్​ తీరం నుంచి యూఏఈకి పెద్ద ఓడలో 6000 టన్నుల తారు తరలిస్తుండగా మునిగిపోయింది. అందులో 22 మంది ఉన్నారు. దీంతో అప్రమత్తమైన ఐసీజీ.. అత్యాధునిక ఏఎల్​హెచ్​ ధ్రువ్​ ఛాపర్లతో రెస్క్యూ ఆపరేషన్​ చేపట్టింది.

అరేబియా సముద్రంలో మునిగిన ఓడ
ఓడలో 20 మంది భారతీయులు కాగా.. పాకిస్థాన్​, శ్రీలంక నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరిని ఇండియన్​ కోస్ట్​ గార్డ్​ పడవలు, ఛాపర్లలో పోర్​బందర్​ పోర్టుకు తరలించారు.

ఇవీ చూడండి: ఠాక్రేపై 'ఆటో- మెర్సిడెస్' పంచ్.. డ్రమ్స్ వాయిస్తూ శిందేకు భార్య స్వాగతం

'నుపుర్ తల తెచ్చిస్తే ఇల్లు రాసిస్తా'.. మత గురువు ప్రకటన.. నిందితుడు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.