కొండ చిలువ గుడ్లను పొదిగించిన పాము సంరక్షకులు.. 8 పిల్లలను అడవిలో..

author img

By

Published : Jun 24, 2022, 3:00 PM IST

8 Python hatchlings born

కర్ణాటకలో అరుదైన ఘటన జరిగింది. కిరణ్, అజయ్​ అనే ఇద్దరు పాముల సంరక్షకులు.. కొండ చిలువ గుడ్లను ఇంక్యూబేషన్​ విధానంలో పొదిగించారు. అనంతరం 8 కొండ చిలువ పిల్లలను అడవిలో వదిలిపెట్టారు.

ఎక్కడైనా కోడి గుడ్లను కృత్రిమంగా పొదిగించడం చూశాం. ఇంకేవైనా గుడ్లు పొదిగించడం చూశాం. కర్ణాటక, మంగళూరుకు చెందిన పాముల సంరక్షులు కిరణ్, అజయ్​ మాత్రం ఏకంగా కొండ చిలువ గుడ్లనే పొదిగించారు. అవి పిల్లలుగా మారాక అటవీ శాఖ అధికారుల సహాయంతో అడవిలో వదిలిపెట్టారు. కిరణ్​, అజయ్​ చేసిన పనికి అటవీ సిబ్బందితో సహా, స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

8 Python hatchlings born
కృతిమ విధానంలో పొదిగిన కొండచిలువ పిల్లలు

అసలేం జరిగిందంటే: దొంగకేరి సమీపంలోని వెంకటరమణ ఆలయానికి ఎదురుగా భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అక్కడ పాము గుడ్లు కనిపించాయి. దీంతో ఇంటి యజమాని షమిత్ సువర్ణ మంచి మనసుతో పాము సంరక్షకులు అజయ్​కు గుడ్లు కనిపించిన విషయం తెలియజేసింది. ఈ విషయాన్ని అజయ్​.. కిరణ్​కు తెలపగా ఇంక్యుబేషన్ విధానంలో గుడ్లు పొదిగే ఏర్పాటు చేశారు.

8 Python hatchlings born
కొండచిలువ పిల్లలను అడవిలో వదులుతున్న పాముల సంరక్షకుడు అజయ్

గుడ్లు పొదిగి కొండచిలువ పిల్లలుగా ఏర్పడిన తర్వాత బంట్వాళ జోనల్ అటవీ అధికారి రాజేశ్​ బలిగార్​ను కలిసి సమాచారం అందించారు. ఎనిమిది కొండ చిలువ పిల్లలను అటవీ అధికారులతో కలిసి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ కార్యక్రమంలో సబ్​ జోనల్ అటవీ అధికారి ప్రీతం పూజారి, అటవీ అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం వీరు చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి.

ఇవీ చదవండి: పాము గుడ్లను రక్షించి.. కృత్రిమంగా పొదిగించి!

కృష్ణుడి విగ్రహం మింగేసిన భక్తుడు.. డాక్టర్ల శ్రమతో లక్కీగా..

అనుమానాస్పదంగా జింకల కళేబరాలు.. సోలార్​ కంపెనీ పనేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.