ETV Bharat / bharat

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం- 12 ఏళ్ల బాలుడిపై కేసు

author img

By

Published : Sep 14, 2021, 4:54 PM IST

మహారాష్ట్రలోని పాల్​గఢ్​ జిల్లాలో ఓ ఐదేళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. మరోవైపు ఉత్తర్​ప్రదేశ్​లోని ముజఫర్​నగర్​ జిల్లాలోనూ అత్యాచార ఘటనలు వెలుగు చూశాయి.

rape incidents in up
ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం..

మహారాష్ట్రలోని పాల్​గఢ్​​ జిల్లా బోయిసార్​ ప్రాంతంలో ఓ ఐదేళ్ల చిన్నారి అత్యాచారానికి గురైంది. కడపునొప్పితో బాధపడుతున్న చిన్నారిని ఆసుపత్రికి తరలించగా ఈ విషయం బయటపడింది. పోలీసులు చిన్నారిని ఆరా తీయగా.. ఓ 12 ఏళ్ల అబ్బాయి అత్యాచారానికి పాల్పడ్డట్టు తెలిసింది.

నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376, పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అతడ్ని అదుపులోకి తీసుకుని, జువైనల్ హోమ్​కు తరలిస్తామని చెప్పారు.

ముంబయిలో ఏడేళ్ల చిన్నారిపై..

ఇటువంటి ఘటనే ముంబయిలో జరిగింది. ఏడేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నందుకుగాను ఓ 50 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చాక్లెట్​ ఇప్పిస్తానంటూ ఆశ చూపి గత కొద్ది రోజులుగా చిన్నారిని లైంగికంగా వేధిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడిపై ఐపీసీ సెక్షన్​ 354 సహా పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఉత్తర్​ప్రదేశ్​లో..

పాఠాలు చెప్పే పిల్లలను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ముజఫర్​నగర్​ జిల్లా పుర్కాజీ ప్రాంతంలో జరిగింది. కంప్యూటర్​ క్లాసులు కోసం వచ్చే ఓ 16 ఏళ్ల దళిత బాలికను (dalit rape victim) నిందితుడు సోమవారం అత్యాచారం చేశాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతడిపై ఐపీసీ, ఎస్​సీ/ఎస్​టీ, పోక్సో చట్టాల కింద కేసు నమోదైంది.

ముజఫర్​నగర్​ జిల్లాలోనే మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. 50 ఏళ్ల మహిళపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

పోలీసుల వివరాల ప్రకారం..

ఇంటికి తిరిగి వస్తున్న బాధితురాలిపై పర్వేజ్​ అనే నిందితుడు అత్యాచారానికి పాల్పడి, ఆపై ఆమెను బెదిరించాడు. ఘటనాస్థలం నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించిన నిందితుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ఇదీ చూడండి : నలుగురు కలిసి మహిళను వివస్త్రను చేసి, ఫోన్​లో వీడియో తీసి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.