ETV Bharat / snippets

ఫైనల్లో బర్త్​డే బాయ్స్- గిఫ్ట్ ఎవరికో?

author img

By ETV Bharat Telugu Team

Published : May 26, 2024, 1:59 PM IST

IPL 2024 Final
IPL 2024 Final (Source: Associated Press)

IPL 2024 Final: 2024 ఐపీఎల్​ ఫైనల్​కు సర్వం సిద్ధమైంది. చెన్నై వేదికగా సన్​రైజర్స్- కోల్​కతా ఆదివారం తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరుజట్ల ఫ్యాన్స్​ మ్యాచ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ రెండు జట్లలోని ఇద్దరు ప్లేయర్లకు స్పెషల్ గేమ్ కానుంది. సునీల్ నరైన్ (కేకేఆర్), నితీశ్ రెడ్డి (సన్​రైజర్స్) పుట్టినరోజు నాడు ఐపీఎల్ ఫైనల్ ఆడనుండడం విశేషం. మే26 ఈ ప్లేయర్లిద్దరి బర్త్​డే. ఇక బర్త్​డే రోజే ఐపీఎల్ టైటిల్ సాధించి, ఈవెంట్​ను మరింత స్పెషల్​గా జరుపుకోవాలని ఇద్దరూ ఆశిస్తున్నారు. కానీ, గెలిచేది ఒక్క జట్టే. చూడాలి మరి ఐపీఎల్ టైటిల్ ఈరోజు ఏ బర్త్​డే బాయ్ దగ్గరకు వెళ్తుందో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.