యాదాద్రిలో తాగునీటికి కటకట - అవస్థలు పడ్డ భక్తులు

By ETV Bharat Telangana Team

Published : Jan 31, 2024, 10:59 AM IST

thumbnail

Yadadri Temple Issues : యాదాద్రి పుణ్యక్షేత్రంలో తాగునీటి కోసం భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. ఇటీవల ఆలయ మాడ వీధుల్లో ఇటీవలే సరైన విద్యుత్ లైట్ల వెలుగులు చీకటిలోనే స్వామివారి సేవోత్సవం జరిపిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ ఆలయాన్ని తాగునీటి సమస్య పీడిస్తోంది. మిషన్ భగీరథ నీటి సరఫరా జరగనందున ఆలయం వద్ద నల్లాల్లో నీళ్లు రాక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

Drinking Water Problems In Yadadri : మంగళవారం రోజున క్షేత్రాన్ని సందర్శించిన భక్తులు దైవ దర్శనం చేసుకొని బయటకు వచ్చేపుడు పులిహోర ప్రసాదాన్ని అందజేశారు.  పులిహోర తిన్న తర్వాత నీళ్లు తాగుదామని నల్లాల వద్దకు వెళ్లిన వారికి నిరాశే ఎదురైంది. తాగునీరు లేక, చివరికి చేతులు కడుక్కునేందుకు సైతం నీళ్లు లేక నానా తంటాలు పడ్డారు. ఆలయ అధికారులపై భక్తులు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తిందని ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.