ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డితో నాకు ప్రాణహాని ఉంది : మోత్కుపల్లి నర్సింహులు - Motkupalli on CM Revanth

By ETV Bharat Telangana Team

Published : May 11, 2024, 3:54 PM IST

thumbnail
ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డితో నాకు ప్రాణహాని ఉంది : మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు (ETV Bharat)

Motkupalli Narasimhulu Fire on CM Revanth Reddy : లోక్​సభ ఎన్నికల వేళ కాంగ్రెస్​ నేత మోత్కుపల్లి నర్సింహులు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్​తో తనకు ప్రాణహాని ఉందని మోత్కుపల్లి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు సీట్లు కేటాయించలేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్​రెడ్డి మాదిగలకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. 

Motkupalli Narasimhulu about Dalits : మాదిగలను అణచివేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని మోత్కుపల్లి ఆరోపించారు. ఆ పార్టీ తీసుకొచ్చిన ఆరు గ్యారెంటీలు ఒక బోగస్ అని అన్నారు. మాదిగల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారని, కేవలం వారిని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 80 లక్షల మంది ఉన్న మాదిగలకు ఒక సీటు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్​ సీట్లు అమ్ముకుని మాదిగలను అవమాన పరిచిందని ఆరోపణలు గుప్పించారు. గత ప్రభుత్వ పాలన నచ్చక మాదిగలు మొత్తం రేవంత్​ను గెలిపించారని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.